తెలంగాణ‌ శాస‌న‌మండ‌లి ప్రొటెం చైర్మ‌న్‌ గా భూపాల్ రెడ్డి నియామకం

Bhoopal Reddy Appointed as Protem Chairman of Telangana Legislative Council

తెలంగాణ‌ రాష్ట్ర శాస‌న‌మండ‌లి ప్రొటెం చైర్మ‌న్‌గా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ వి.భూపాల్ రెడ్డి నియమితులయ్యారు. భూపాల్ రెడ్డిని ప్రొటెం చైర్మ‌న్‌గా నియ‌మిస్తూ తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌రరాజ‌న్ గురువారం నాడు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్రొటెం చైర్మ‌న్‌ గా రేపటి నుంచి (జూన్ 4, శుక్రవారం) భూపాల్ రెడ్డి బాధ్య‌త‌లు చేపట్టనుండగా, మండలి చైర్మన్ ను ఎన్నుకునే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ముందుగా ప్రస్తుత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మ‌న్ నేతి విద్యాసాగర్ ల పదవీకాలం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలోనే ప్రొటెం చైర్మ‌న్‌ నియామకం చేపట్టారు. మరోవైపు చైర్మ‌న్, డిప్యూటీ చైర్మ‌న్ తో పాటుగా ఎమ్మెల్సీలు బోడ‌కుంటి వెంక‌టేశ్వ‌ర్లు, ఫ‌రీదుద్దీన్‌, క‌డియం శ్రీహ‌రి, ఆకుల ల‌లిత‌ పదవీకాలం కూడా నేటితో పూర్తయింది. ఎమ్మెల్సీల పదవీకాల గడువు ముగియక ముందే ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం నెలకున్న కరోనా పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా వేస్తున్నామని, కరోనా తీవ్రత తగ్గాకే నిర్ణయం తీసుకోనున్నట్టు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ