తెలంగాణలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజులు ఖరారు చేసిన ప్రభుత్వం

Telangana Govt Finalizes the Fees in Engineering Colleges as per Recommendations of AFRC For Next Three Years, Telangana Govt Finalizes Engineering College Fees, Recommendations of AFRC For Three Years, Fee Hiked In Engineering Colleges, Mango News, Mango News Telugu, TS EAMCET 2022, Tuition Fee fixed For Engineering, Telangana Admission And Fee, Top Engineering Colleges in Telangana, Engineering Colleges in Telangana 2022, Telangana Engineering Colleges Fee Structure 2022-23, B Tech Colleges In Hyderabad

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేసింది. తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) సిఫారసులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని 159 ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేసింది. అదే సమయంలో ఇంజినీరింగ్‌తో పాటు ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్‌ ఎంటెక్ బోధించే కాలేజీలకు కూడా ఫీజులను కూడా ఖరారు చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం బుధవారం సర్క్యులర్‌ జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఇంజినీరింగ్ కాలేజీల్లో కనీస ఫీజు రూ. 45 వేలకు పెంచారు. దీనిప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 కాలేజీల్లో ఇంజినీరింగ్ ఫీజు లక్ష రూపాయలు దాటింది. ఎంజీఐటీలో రూ.1.60 లక్షలు, సీవీఆర్ లో రూ.1.50 లక్షలు, సీబీఐటీలో, వర్ధమాన్, వాసవి కాలేజీల్లో రూ.1.40 లక్షలుగా ఉండనుంది. అలాగే ఎంబీఏ, ఎంసీఏ కనీస వార్షిక ఫీజు రూ.27వేలు, ఎంటెక్ కనీస వార్షిక రుసుము రూ. 57 వేలు ఖరారు చేశారు. ఈ ఫీజుల పెంపు మూడేళ్ల పాటు అమల్లో ఉంటుందని ఉత్తర్వులో స్పష్టం చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =