కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యుల‌రైజేష‌న్ దిశగా తెలంగాణ ఆర్థిక శాఖ కీలక ఉత్త‌ర్వులు

Telangana Finance Department Approves For Regularization of Contract Employees in All Departments, Regularization of Contract Employees in All Departments, Finance Department Approves For Regularization of Contract Employees in All Departments, Finance Department Approves For Regularization of Contract Employees, Telangana Finance Ministry on Tuesday asked all departments to give proposals for regularization, Good news for Telangana contract employees in All Departments, Telangana contract employees, Regularisation of Contract Employees, a surprise gift for the contract employees, Telangana govt Anounces a surprise gift for the contract employees in All Departments, contract employees, Telangana Finance Department, contract employees Latest News, contract employees Latest Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ఒక శుభవార్త. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యుల‌రైజేష‌న్ ప్రక్రియ‌కు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2016లో జారీ చేసిన జీవో 16 ప్రకారం.. తమ వద్ద పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను పంపించాల్సిందిగా పలు ప్రభుత్వ శాఖలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి ఆదేశాలు వెళ్లాయి. తెలంగాణలోని కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ వారి అర్హతలని బట్టి రెగ్యులరైజ్ చేస్తామని ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు మార్చి 9న శాసనసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఉన్న మొత్తం 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వెల్లడించారు.

దీని ప్రకారం సంబంధిత పోస్టుల్లో రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు అర్హత ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను త్వరలోనే రెగ్యులరైజ్ చేయనున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. అయితే తెలంగాణ లో 2014 జూన్ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్న వారిని రెగ్యులరైజ్ చేయాలని అప్పట్లోనే ప్రభుత్వం భావించి ప్రతిపాదనలు తీసుకురాగా, కొందరు దీనిపై కోర్టులో కేసులు వేయటం, హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేయటం మూలంగా ఇది మధ్యలోనే ఆగిపోయింది. అయితే దీనిపై తుది విచారణ జరిపిన హైకోర్టు గతేడాది డిసెంబరు 7న సంబంధిత రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ ఆదేశాలిచ్చినందున దీనిపై ప్రభుత్వం మళ్ళీ దృష్టి పెట్టింది. కాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యుల‌రైజేష‌న్ తోపాటు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయటానికి కార్యాచరణ రూపొందిస్తోంది ప్రభుత్వం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 1 =