తెలంగాణలోని ప్రతి పల్లె ముఖ్రాకే కావాలి, స్వయం సమృద్ధి బాటలో పయనించాలి: సీఎం కేసీఆర్

CM KCR Appreciates Muckrake Village Sarpanch and People for Donating 1 Lakh to CM Relief Fund,CM KCR Appreciates,Muckrake Village Sarpanch,People for Donating 1 Lakh,CM Relief Fund,Mango News,Mango News Telugu,CM Relief Fund Latest News and Updates,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణలోని ప్రతి పల్లె ముఖ్రా(కే) కావాలని, ఈ గ్రామాన్ని ఆదర్శంగా చేసుకుని స్వయం సమృద్ధి బాటలో తెలంగాణ పల్లెలు పయనించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. ముఖ్రా(కే) గ్రామంలో సేకరించిన చెత్తతో తయారు చేసిన వర్మికంపోస్టుతో వచ్చిన ఆదాయం నుంచి లక్ష రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిదికి ఇవ్వడం అద్భుతమని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం సీఎం ను కలిసిన ముఖ్రా(కే) గ్రామ సర్పంచ్, గ్రామస్తులు సీఎం సహాయ నిధికి లక్ష రూపాయల చెక్కునందించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ పల్లెలు ప్రగతి ప్రస్థానంలో సాగుతున్నాయని, గ్రామాల్లో పల్లె ప్రగతి ఫలాలు కనిపిస్తున్నాయని, స్వయం సమృద్ధి దిశగా అడుగులు వెస్తున్నాయనడానికి ముఖ్రా(కే) గ్రామం ఉదాహారణగా నిలిచిందన్నారు. గ్రామంలో సేకరించిన తడిచెత్త ద్వారా వర్మికంపొస్ట్ తయారు చెసి 7 లక్షలు ఆదాయాన్ని సంపాదించడం అద్భుతమన్నారు. అందులోంచి ముఖ్రా(కే) సర్పంచ్ లక్ష రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వడం అభినందనీయమన్నారు. గ్రామానికి వచ్చిన ఆదాయం నుంచి రూ.4 లక్షలతో సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేసి కరెంట్ ఉత్పత్తి చెస్తున్నామని, 2 లక్షల రూపాయలతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశామని, 1 లక్ష రూపాయలు సీఎం సహాయనిధికి ఇస్తున్నామని ఈ సందర్భంగా సర్పంచ్ సీఎంకు వివరించారు.

కాగా ముఖ్రా(కే) గ్రామంలో లక్ష మొక్కలు నాటి 100% రక్షించడం ద్వారా ఈ గ్రామం దేశానికే అదర్శంగా నిలిచింది. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కోసం పని చేస్తున్న సర్పంచ్ గాడ్గె మీనాక్షిని, గ్రామ క్రమిటీని గ్రామస్తులను సీఎం అభినందించారు. ఈ సందర్భంగా గ్రామంలో తయారు చెసిన వర్మికంపొస్టు ప్యాకెట్ ను ముఖ్యమంత్రికి సర్పంచ్ మీనాక్షి అందించారు. ఈ సందర్భంగా సీఎం వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, తదితరులున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE