ఫ్రీ సింబల్స్ జాబితాలో మినహాయింపు

An exception to the free symbols list,An exception to the free symbols,free symbols list,Mango News,Mango News Telugu,Telangana, An exception to the free symbols list, symbols,Auto, hat, iron box, truck symbols,free symbols list,Telangna BJP Party,List of Political Parties and Free Symbols,How are election symbols allotted,Election symbols, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Election symbols Latest News,Election symbols Latest Updates
Telangana, An exception to the free symbols list, symbols,Auto, hat, iron box, truck symbols,

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఓ విషయంపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంటున్న కొన్ని గుర్తులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మినహాయింపు ఇచ్చింది.

ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. త్వరలో 5 రాష్ట్రాలలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడానికి 193 గుర్తులతో కూడిన.. ఫ్రీ సింబల్స్ లిస్టును ఈసీ ప్రకటించింది. అయితే వీటిలో ఆటో , హ్యాట్, ఇస్త్రీ పెట్టె, ట్రక్కు గుర్తులను ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఎవరికీ కేటాయించకుండా ఉత్తర్వులు జారీ చేసింది

ఆటో , హ్యాట్, ఇస్త్రీ పెట్టె, ట్రక్కు నాలుగు గుర్తులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.ఎందుకంటే పైన  చెప్పిన గుర్తులు..తెలంగాణ అధికారల బీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారుకు దగ్గరగా ఉండటం పైగా బీఆర్ఎస్ అభ్యర్థనను కూడా పరిగణనలోకి తీసుకుని  ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ గుర్తుల విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది బీఆర్ఎస్ పార్టీ. ఆటో రిక్షా, హ్యాట్, ఇస్త్రీపెట్టె, ట్రక్కు గుర్తులు కంటి చూపు సరిగా లేని వారికి కారు వలే కనిపిస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ గుర్తుల వల్ల కొంతమంది  అవగాహన  మరియు కంటిచూపు  లేనివాళ్లు కన్ఫ్యూజ్ అవుతున్నారని.. దీని వల్ల పార్టీకి పడాల్సిన ఓట్లు ఆయా గుర్తులకు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.  గత ఎన్నికల్ల సమయంలోనే ఈ విషయంలో  తాము నష్టపోతున్నామని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ లెటర్  ద్వారా ఫిర్యాదు చేసింది.

బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన అభ్యర్థన పత్రాన్ని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం..ఈ సారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణలో ఆ నాలుగు గుర్తులను ఎవరికీ కేటాయించకూడదని నిర్ణయం తీసుకుంది. అయితే బీఆర్ఎస్ నాయకులు..  రోటీ మేకర్ ను మాత్రం ఎవరికీ ఇవ్వొద్దని కోరినా కూడా దానిని ఫ్రీ సింబల్స్ జాబితాలో అలాగే ఉంచడం బీఆర్ఎస్ నాయకులను కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడటంతో  రోటీ మేకర్ గుర్తును కేటాయించకుండా అడ్డుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కోర్టుకు వెళ్లే సమయం కూడా లేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + six =