శ్రీలంకతో టీ20 పోరుకు భారత్ సిద్ధం, నేడే తోలి టీ20 మ్యాచ్

India vs Sri Lanka T20 Series: 1st T20I at Mumbai Wankhede Stadium Today,BCCI schedule of home series, BCCI schedule against Sri Lanka,BCCI schedule New Zealand,BCCI schedule Australia,Mango News,Mango News Telugu,3 Member Cricket Advisory Committee,BCCI Advisory Committee,Advisory Committee BCCI,BCCI,BCCI Latest News and Updates,BCCI Latest News and Live Updates,The Board of Control for Cricket in India,India’s Tour of Bangladesh,India Vs Sri Lanka,India Vs New Zealand,India Vs Australia,Sri Lanka,New Zealand,Australia,BCCI Schedule Latest News, BCCI Schedule News Updates

భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఈ రోజు (జనవరి 3, మంగళవారం) రాత్రి 7 గంటల నుంచి తోలి టీ20 జరగనుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత్, శ్రీలంక జట్లు తోలి టీ20లో తలపడనున్నాయి. శ్రీలంకతో టీ20 సిరీస్ కు నిర్ణీత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కేఎల్ రాహుల్ లకు విశ్రాంతి కల్పించారు. దీంతో యువ ఆటగాళ్లతో కూడిన భారత్ టీ20 జట్టుకు కెప్టెన్ గా హార్దిక్‌ పాండ్యా, వైస్ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నారు. టీ20 ప్రపంచకప్‌-2022లో భారత్ జట్టు సెమీఫైనల్స్ లో వెనుదిరిగిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌-2024కు ఇప్పటినుంచే సన్నద్ధమయ్యేలా యువకులకు ఎక్కువ అవకాశాలు ఇస్తూ రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలనీ బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా శ్రీలంకతో టీ20 సిరీస్ లో రాణించి క్రికెట్ అభిమానులను అలరించేందుకు భారత్ జట్టు పూర్తిస్థాయిలో సిద్దమవుతుంది.

ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లో ఉండడంతో భారత్ కు కలిసి రానుంది. కాగా రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్‌, దీపక్ హుడా కూడా అవకాశాన్ని అందిపుచ్చుకుని సత్తా చాటాలని చూస్తున్నారు. బౌలర్లకు సంబంధించి తుది జట్టులో వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ కి చోటు దక్కే అవకాశం ఉంది. అలాగే అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్, శివమ్ మావిలలో ఎవరికైనా తుదిజట్టులో చోటుంటుందేమో వేచిచూడాలి. ఇక కెప్టెన్ దాసున్ షనక నేతృత్వంలో శ్రీలంక జట్టు భారత్ పై పైచేయి సాధించి, సిరీస్ నెగ్గాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతుంది. దాసున్ షనక, హసరంగ, ధనంజయ డిసిల్వా, చమిక కరుణరత్నె, నిస్సాంక, కుశాల్‌ మెండిస్‌ బ్యాటింగ్ లో, మహిశ్ తీక్షణ, లహిరు కుమార బౌలింగ్ లో రాణించడంపైనే శ్రీలంక విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

భారత్ తుది జట్టు అంచనా: ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్.

శ్రీలంక తుది జట్టు అంచనా: పాతుమ్ నిస్సాంక, కుశాల్‌ మెండిస్‌ (వికెట్ కీపర్), ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దాసున్ షనక (కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహిశ్ తీక్షణ, దిల్షన్ మదుశంక, లహిరు కుమార.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =