పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం: అమరులైన పోలీసులకు ఘన నివాళులర్పించిన సీఎం కేసీఆర్

CM KCR Paid Tribute to the Police Martyrs On the occasion of Police Martyrs Memorial Day, Telangana CM KCR, CM KCR Paid Tribute to the Police Martyrs, Telangana Police Martyrs, Mango News, Mango News Telugu,Police Martyrs Memorial Day, Police Martyrs Memorial Day 2022, Police Martyrs Day Telangana, Telangana Latest News And Updates, Telangana Police News And Live Updates, Police Martyrs, CM KCR Tributes to Police Martyrs,

పౌరుల భద్రత, నేర నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమ జీవితాలను తృణప్రాయంగా అర్పించిన పోలీసుల త్యాగం అజరామరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. “పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం” సందర్భంగా అమరులైన పోలీసులకు సీఎం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసుల త్యాగాలను సీఎం స్మరించుకున్నారు. విధి నిర్వహణ కోసం ప్రాణాలనైనా అర్పించేందుకు సిద్ధపడే పోలీసుల త్యాగం, దేశ రక్షణ కోసం పోరాడే సైనికుల త్యాగాలతో సమానమైనవన్నారు. కుటుంబాలకు దూరంగా, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా, అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసుల సేవలు వెలకట్టలేనివన్నారు. ప్రశాంత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంలో, శాంతి భధ్రతల నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలపడంలో పోలీసుల పాత్ర గొప్పదని సీఎం అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రశాంత వాతావరణం తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు. అందుకు హోం మంత్రిని, రాష్ట్ర పోలీసు శాఖను, డీజీపీని, పోలీసు ఉన్నతాధికారులను సిబ్బందిని కేసీఆర్ సీఎం అభినందించారు.

శాంతి భధ్రతల పరిరక్షణతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల సమాచార సమన్వయం కోసం, దేశానికే ఆదర్శంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్మించిందని సీఎం తెలిపారు. కమాండ్ సెంటర్ ద్వారా అమలులోకి తెచ్చిన అత్యున్నత సాంకేతికతను రాష్ట్ర పోలీసులు అందిపుచ్చుకుని సేవలందిస్తున్నారని, ఈ క్రమంలో దేశంలోనే అత్యుత్తమ పోలీసులుగా తెలంగాణ పోలీసులు నిలిచారని సీఎం అన్నారు. కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సహచర పోలీసు అమరుల త్యాగాల స్ఫూర్తితో విధి నిర్వహణకు పునరంకితం కావాలని రాష్ట్ర పోలీసులకు ఈ సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు. పోలీసు కుటుంబాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వున్నదని సీఎం పునరుద్ఘాటించారు. పోలీసుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY