ప్రజాకవి కాళోజీ సాహిత్యం తెలంగాణ యాసకు, భాషకు, భావుకతకు ప్రతీక: సీఎం కేసీఆర్

CM KCR Remembered Services Of Padma Vibhushan Kaloji Narayana Rao On His Birth Anniversary, CM KCR Pays Tributes To Kaloji Narayana Rao, Telangana Govt Celebrities Kaloji Birthday, Kaloji Is A Symbol Of Telangana Dialect, Mango News, Mango News Telugu, CM KCR Greets People On Telangana Day, Padma Vibhushan Kaloji Narayana Rao, Kaloji Narayana Rao Birth Anniversary, Kaloji Birth Anniversary, Telangana Day Celebrations, Telangana Day Latest News And Updates

నిత్యం పరుల క్షేమానికై పరితపించిన ప్రజాకవి కాళోజీ సాహిత్యం తెలంగాణ యాసకు, భాషకు, భావుకతకు ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. పద్మవిభూషణ్ కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా ఆయనను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సామాజిక ఉద్యమకారునిగా, కవిగా కాళోజీ చేసిన సేవలు గొప్పవని సీఎం అన్నారు. తెలంగాణ భాషకు, సాహిత్యానికి కాళోజీ చేసిన కృషిని గౌరవిస్తూ, కాళోజీ జయంతిని “తెలంగాణ భాషా దినోత్సవం” గా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నదని సీఎం తెలిపారు.

తెలంగాణ భాషా, సాహిత్య రంగాల్లో విశేష కృషిచేస్తున్న తెలంగాణ సాహితీవేత్తలను, కవులను, వైతాళికులను గుర్తించి కాళోజీ నారాయణ రావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట పురస్కారాన్ని అందిస్తున్నదని సీఎం అన్నారు. ఈ సంవత్సరానికి గాను కాళోజీ పురస్కారాన్ని అందుకున్న కవి, చరిత్రకారుడు శ్రీరామోజు హరగోపాల్ కు సీఎం ఈ సందర్భంగా శుభాభినందనలు తెలిపారు. ‘పుట్టుకనీది చావునీది బతుకంతా దేశానిది’ అనే కాళోజీ చైతన్య స్ఫూర్తిని కొనసాగిస్తూ, తెలంగాణ రాష్ట్ర, ప్రగతి నమూనాను దేశవ్యాప్తం చేసేందుకు ముందడుగు వేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY