మాజీ మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్

CM KCR Visited Former Minister Naini Narsimha Reddy at Apollo Hospital

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డిని బుధవారం నాడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పరామర్శించారు. నాయిని నర్సింహా రెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఓదార్చారు. కుటుంబ స‌భ్యుల‌కు ధైర్యం చెప్పారు. నాయిని ఆరోగ్య ప‌రిస్థితిని డాక్ట‌ర్ల‌ను అడిగి తెలుసుకుని, మ‌రింత మెరుగైన చికిత్స అందించాల‌ని వైద్యులకు సూచించారు. సీఎం కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, తదితరులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu