వర్షాల వలన సర్టిఫికెట్స్ పొతే, కొత్తవి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

CM KCR, Heavy Rainfall In Hyderabad, Heavy Rains in Hyd, Heavy Rains In Hyderabad, Hyderabad Rains, Hyderabad Rains news, Lost Certificates due to Rains, New Certificates to Students who Lost Certificates due to Rains, Rains In Hyderabad, telangana, Telangana Govt, Telangana Govt Decides to Issue New Certificates to Students, Telangana rains, telangana rains news, telangana rains updates

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లోని చాలా ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరదల వలన తమ సర్టిఫికెట్స్ పాడవడం లేదా కొట్టుకుపోయాయని పలువురు విద్యార్థులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్టిఫికెట్స్ పోగొట్టుకున్న విద్యార్థులకు ఉచితంగా కొత్తవి జారీ చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

ఈ మేరకు అన్ని బోర్డులకు, యూనివర్సిటీలకు ఆదేశాలు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో కొత్త సర్టిఫికెట్స్ కోసం ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో విధానంలో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ విద్యార్థులకు‌ సూచించారు. మరోవైపు భారీవర్షాల వలన రాష్ట్రంలో జరగాల్సిన అన్నిపరీక్షలను దసరా వరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − eight =