తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కెసిఆర్ ఈ రోజు తన స్వగ్రామమైన చింతమడకలో పర్యటించారు. చింతమడక గ్రామం చేరుకొని, ఊర్లో ఉన్న దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం సభ వేదిక దగ్గరకు చేరుకొని, తన స్నేహితులతో ముచ్చటించి, గ్రామస్తులతో కరచాలనం చేసారు. తరువాత అధికారులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం సభా ప్రాంగణంలో గ్రామాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కెసిఆర్ మాట్లాడుతూ, గ్రామప్రజలందరిని ఐకమత్యంగా ఉండాలని కోరారు,అలా ఉంటేనే ఊరు అభివృద్ధి జరిగి మంచి పేరు వస్తుందని చెప్పారు. తన బాల్య జ్ఞాపకాలు, గురువుల చేసిన సహాయం, మిత్రులతో గడిపిన సందర్భాలు, విద్యాభ్యాసం సంగతులు గ్రామస్తులతో పంచుకున్నారు, వచ్చే నెల రోజుల్లో గ్రామంలో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను, ఎమ్మెల్యే హరీష్ రావును ఆదేశించారు.
చింతమడక గ్రామంలో ఉండే ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షల సమానంగా లబ్ధి చేకూరుస్తామని,చింతమడక గ్రామానికి 2,000 ఇళ్ళు మంజూరు చేస్తునట్టు ప్రకటించారు. కార్తీక మాసం కల్లా ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలన్నారు, అంతే కాకుండా చింతమడక కోసం మరో రూ.50 కోట్లు మంజూరు చేస్తానని చెప్పారు. చింతమడక గ్రామంలో పాల పరిశ్రమ, కోళ్ల పెంపకంపై ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారని, గ్రామస్తులకు అవకాశాలు కల్పించి,పూర్తీ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఎవరికీ నచ్చిన పని వారు చేసుకోవచ్చని, ఎవరిని బలవంతంగా ఇదే చేయాలని చెప్పారని ముఖ్యమంత్రి చెప్పారు. ఫంక్షన్ హాళ్ళ నిర్మాణం,తాగునీటి సదుపాయాలు,రోడ్లు, డ్రైనేజిల నిర్మాణం మరియు ఇతర అన్ని సదుపాయాలను చింతమడక గ్రామానికి కల్పిస్తాం అని కెసిఆర్ తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ఇంకా సిద్దిపేట్ ఎమ్మెల్యే హరీష్ రావు,మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు.
[subscribe]
[youtube_video videoid=vua_TShX64g]