బీజేపీలోకి మళ్ళీ టీడీపీ నేతల వలసలు?

Another blow to TDP As Leaders Likely To Join BJP, BJP eyes on TDP leaders in AP, Former TDP MLA eager to join BJP, Mango News, Many TDP leaders queue up to join the BJP, Several TDP Leaders Likely To Join BJP Soon?, TDP leaders Planning to Join In BJP

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో టీడీపీ పరాజయం పొందడం, మరో వైపు కేంద్రంలో బీజేపీ పార్టీ ఘనవిజయం సాధించి రెండో సారి అధికారం చేపట్టడంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకి మారిపోతున్నాయి. పార్టీ పరాజయం తరువాత డీలా పడ్డ టీడీపీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు కొంతమంది బీజేపీ పార్టీని ప్రత్యాన్మాయంగా చూస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ తో వైరం కారణంగా, టీడీపీ నాయకులు బీజేపీలో చేరడానికే ఎక్కువుగా మొగ్గు చూపుతున్నారు, ఇటీవలే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.మరో వైపు మళ్ళీ తమపార్టీలోకి భారీ వలసలు ఉంటాయంటూ బీజేపీ నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.

గుంటూరు జిల్లాలో ప్రముఖ టీడీపీ నాయకుడు రాయపాటి సాంబశివరావు బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు,బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో సంప్రదింపుల తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, శ్రావణమాసంలో ఇతర పార్టీలనుండి బీజేపీ లోకి భారీ చేరికలు ఉంటాయని చెప్పారు. మరో వైపు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్సింహారావు కూడ చాలామంది ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు తమతో టచ్ లో ఉన్నారని ఒక ఇంటర్వ్యూ లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి ఎవరు వెళ్తారో అన్న అనుమానాలు టీడిపి లో మొదలయ్యాయి, అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం నాయకులు వెళ్ళిపోతే కొత్తవారు వస్తారని, ప్రజల్లో ఉండి, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలనీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.

 

[subscribe]
[youtube_video videoid=k03TPeAUzlg]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 3 =