డబ్బుల పంపకాలలో పోటీ పడుతున్న నేతలు

Competing leaders in remittances,Competing leaders,leaders in remittances,Telangana,leaders ,all parties, Leaders counting, votes,Telangana Assembly Elections 2023,Assembly seat, BJP,BRS, Congress,BSP, CPI, CPM,Mango News,Mango News Telugu,Telanaga Assembly Elections Latest News,Telanaga Assembly Elections Latest Updates,Telangana Latest News And Updates,Telangana Election Latest Updates,Telangana Politics, Telangana Political News And Updates,Assembly seat Latest News
Telangana,leaders ,all parties, Leaders counting, votes,Telangana Assembly Elections 2023,assembly seat, BJP,BRS, Congress,Bsp, CPI, CPM

పోలింగ్ కు మరో ఐదు రోజులే మిగిలి ఉండటంతో.. ఓట్ల కోసం నేతలంతా నోట్ల పంపిణీని స్టార్ట్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల రాజకీయ నేతలంతా  ప్రలోభాలకు తెర తీశారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో హోరాహోరీగా పోరు జరుగుతుండటంతో.. పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో  ప్రధాన పార్టీ అభ్యర్థులు డబ్బుల పంపిణీని ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ఒక నియోజకవర్గంలో అయితే ఓటర్లకు రాత్రికి రాత్రే  ఓ ప్రధాన పార్టీ పంపకాలు పూర్తి చేసినట్లు సమాచారం. అంతేకాదు పాలేరు, ఖమ్మం రెండు నియోజకవర్గాల్లో ఓటర్లకు ఒక చోట ఓటుకు రూ.3 వేలు ఇస్తే, మరొక చోట రూ.2 వేల చొప్పున డబ్బులు పంచినట్లు స్థానికులు చెబుతున్నారు.  ఇటు హైదరాబాద్‌లో కూడా కొన్ని నియోజకవర్గాల్లో డబ్బుల పంపకాలను  మొదలుపెట్టేశారు నేతలు.

శేరిలింగంపల్లిలో ఓ పార్టీ నాయకుడు ఓటుకు రూ.3వేల చొప్పున పంపిణీ చేస్తున్నారట. అటు వరంగల్‌ జిల్లాలో భూపాలపల్లి, పాలకుర్తి, మహబూబాబాద్‌,  వర్దన్నపేట నియోజకవర్గాల్లో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల దాకా డబ్బులు పంచుతున్నారట. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రలోభాలు మొదలయ్యాయి. ఇప్పటికే చాలా చోట్ల డబ్బుల పంపకాలు షురూ అయినట్లు తెలుస్తుంది.

అధికారులు ఒకవైపు తనిఖీలు చేస్తుండటం.. మరోవైపు డబ్బును ఒకే దగ్గర నిల్వ చేయడం మంచిది కాదని అనుకుంటున్న ఎమ్మెల్యే అభ్యర్థులు  వీలయినంత తొందరగా ఆ పని ముగించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డబ్బు పంపకాల వ్యవహారాన్ని పోలింగ్ ముందు రోజు రాత్రి వరకూ పెట్టుకుని టెన్షన్‌ పడడం కంటే ముందుగానే పంచేస్తే మంచిదనే అభిప్రాయంతో చాలామంది పంపకాలు చేసేస్తున్నారు.

అయితే, డబ్బు పంపిణీలో విషయంలో ఒక్కో పార్టీ నేత ఒక్కో విధానాన్ని ఫాలో అవుతున్నారు. ఇప్పటికే, బీఆర్‌ఎస్‌  తమ పార్టీ అభ్యర్థులకు భారీగానే ఫండింగ్‌ చేసి.. ఒక విడత నిధులను ఎప్పుడో అభ్యర్థులకు ఇచ్చేసింది. ఇప్పుడు మిగతా నిధులను కూడా  సర్దుబాటు చేసి నేతలను అలర్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు కాంగ్రెస్‌ అభ్యర్థులకు అధిష్టానం నుంచి వచ్చిన నిధులు తక్కువయినా..సొంత డబ్బులుతోనే  చాలామంది నేతలు ఈ పంపకాలు సాగిస్తున్నారు.  తమ సొంత డబ్బునే ఖర్చు పెట్టుకుంటున్నారన్న లెక్కలతోనే ఆ పార్టీ సగానికి పైగా నియోజకవర్గాల్లో ఆర్థికంగా  బలంగా ఉన్నవారికే ఎమ్మెల్యే  అభ్యర్థులుగా నిలబెట్టిందన్న వాదన వినిపిస్తోంది.

మరో వైపు ఖర్చు విషయంలో ఎప్పుడూ వెనుకంజలో ఉండే భారతీయ జనతా పార్టీ కూడా ఈ సారి ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గంలో భారీగా ఖర్చు చేయడానికి  రెడీ అయిపోయిందట. తమ పార్టీ బలంగా ఉన్న చోట్ల భారీగీ నిధులను సర్దుబాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణలో ఎక్కడ చూసినా నోట్లు కట్టలు ఓట్ల కోసం ప్రవాహంలా పారుతున్న సీన్లే కనిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE