మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల తేదీ ఖరారు

MAA association Latest News, MAA Elections, MAA Elections 2021, Mango News, Movie Artistes Association, Movie Artistes Association Elections, Movie Artistes Association Elections Date, Movie Artistes Association Elections News, Movie Artistes Association Elections Schedule, Movie Artistes’ Association Elections to be held on October 10th, Movie Artists Association election, Movie Artists Association polls, Tollywood’s MAA elections

తెలుగు సినీపరిశ్రమకు సంబంధించిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. గత కొన్నిరోజులుగా ‘మా’ ఎన్నికల నిర్వహణపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మా’ క్రమశిక్షణ సంఘం ఎన్నికల తేదీని ఖరారు చేసింది. అక్టోబర్ 10, ఆదివారం నాడు 2021-23 టర్మ్ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ఎన్నికలను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అలాగే ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు వీకే నరేష్ కూడా మా ఎన్నికలపై ప్రకటన చేశారు. సీనియర్ ఆర్టిస్ట్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని కోవిడ్ నిబంధనలను, ఇతర జాగ్రత్తలను పాటిస్తూ ఎన్నికల నిర్వహణ ఉంటుందని తెలిపారు.

కాగా ‘మా’ అధ్యక్ష పదవికోసం ఈసారి పలువురు ప్రముఖ నటీ, నటులు బరిలోకి దిగనుండడంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌, హీరో మంచు విష్ణు, నటి హేమ, సీవీఎల్ నర్సింహారావు, కాదంబరి కిరణ్ మా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అలాగే నటి జీవిత రాజశేఖర్ కూడా పోటీ చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే చివరికి వీరంతా బరిలోకి దిగుతారా లేదా ఏకగ్రీవానికి ఏమైనా అవకాశం ఉంటుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. ‘మా’ భవనం నిర్మాణం, ఆర్టిస్ట్స్ సమస్యలపైనే అభ్యర్థులు ప్రధానంగా దృష్టిసారించనున్నట్టు తెలుస్తుంది. తాజాగా ‘మా’ ఎన్నికల తేదీ ఖరారు కావడంతో అధ్యక్ష పదవికి పోటీచేసే అభ్యర్థులు, వారి ప్యానెల్‌ సభ్యులు వెంటనే ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + seven =