రాజకీయ గురువులకే చుక్కలు చూపిస్తున్న శిష్యులు

Disciples showing dots to the political gurus,Disciples showing dots,dots to the political gurus,telangana politics, telangana assembly elections, brs, congress, njp, kcr,Mango News,Mango News Telugu,The Guru and his disciple,political gurus,Telangana polls,Telangana Latest News And Updates,Telangana Election Latest Updates,Telangana Politics, Telangana Political News And Updates,Assembly seat Latest News
telangana politics, telangana assembly elections, brs, congress, njp, kcr

రాజకీయం అంటేనే వ్యూహం.. ఎత్తుగడలు.. ఎత్తుకు పై ఎత్తు వేయడం. అయితే కొందరు మాత్రం ఎన్నికలవేళ.. గురువులకే పంగనామాలు పెడుతున్నారు. ఇన్నాళ్లూ వారి వెంటే తిరిగి.. ఇప్పుడు వారికే ఎదురు తిరిగి ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలబడుతున్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. గురువులకే చుక్కలు చూపిస్తున్నారు. వారి దగ్గరే రాజకీయం నేర్చుకొని.. వారినే ఓడించేందుకు పావులు కదుపుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇటువంటి  ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

ఒకప్పుడు కేసీఆర్‌కు ఈటల రాజేందర్ నమ్మిన బంటు. కానీ ఇప్పుడు భద్ర శత్రువు. 2004 నుంచి 2022 వరకు ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఈటల.. కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. అంచలంచెలుగా ఈటల బీఆర్ఎస్ పార్టీలో ఎదుగుతూ వచ్చారు. ఏమయిందో ఏమో కేసీఆర్‌తో పొసగకపోవడంతో.. ఈటల రాజేందర్ 2022లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకొచ్చారు. ఆ తర్వాత బీజేపీలో చేరి.. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్‌పై ఘన విజయం సాధించారు. ఇప్పుడు ఏకంగా సీఎం కేసీఆర్‌నే ఢీ కొట్టేందుకు గజ్వేల్ నుంచి ఈటల పోటీ చేస్తున్నారు. కేసీఆర్‌ను ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

అటు వనపర్తిలో కూడా ఇటువంటి సీనే కనిపిస్తోంది. వనపర్తి నుంచి బీఆర్ఎస్ తరుపున సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి మేఘారెడ్డి బరిలోకి దిగుతున్నారు. అయితే మేఘారెడ్డి ఒకప్పుడు నిరంజన్ రెడ్డి అనుచరుడే. మొన్నటి వరకు కూడా మేఘారెడ్డి నిరంజన్ రెడ్డి వెన్నంటే ఉన్నారు. అయితే వనపర్తిలో మేఘారెడ్డి ఇమేజ్ రోజురోజుకు పెరిగిపోతుండడంతో.. అప్పట్లో నిరంజన్ రెడ్డి ఆయనను దూరం పెట్టారు. దీంతో మేఘారెడ్డి కాంగ్రెస్‌లో చేరి టికెట్ దక్కించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి గురువుకే చుక్కలు చూపిస్తున్నారు. ఒకప్పుడు మంత్రి జగీశ్‌రెడ్డికి జానయ్య యాదవ్ అనుచరుడు. కానీ ఇప్పుడ జగదీశ్ రెడ్డికే ఎదురు తిరిగి ప్రత్యర్థిగా జానయ్య యాదవ్ ఎన్నికల బరిలోకి దిగారు. జగదీశ్ రెడ్డి బీఆర్ఎస్ తరుపున పోటీ చేస్తుండగా.. జానయ్య యాదవ్ బీఎస్పీ  నుంచి పోటీ చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =