హైదరాబాద్ లో ర్యాపిడ్ టెస్టులు ప్రారంభం, 30 నిమిషాల్లోనే ఫలితం

Corona Testing, Rapid Antigen Tests Started in GHMC Limits, Hyderabad,Rapid Antigen Tests Started in GHMC,Rapid Antigen Tests Started in Hyderabad Rapid antigen tests,Coronavirus in Telangana,Coronavirus Live Updates,

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలలో భాగంగా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కరోనా పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో జూలై 8, బుధవారం నుంచి ర్యాపిడ్ టెస్టులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో 50 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, రంగారెడ్డిలో 20, అలాగే మేడ్చల్‌లో 20 ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఈ పరీక్షలు చేస్తున్నారు. ఒక్కో హెల్త్ సెంటర్ పరిధిలో 25 మందికి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కరోనా అనుమానితులకి, పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారితో సన్నిహితంగా మెలిగిన వారికీ ముందుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముక్కు, గొంతు స్రావాలు(స్వాబ్‌) సేకరించి ప్రత్యేక కిట్‌ తో చేసే ఈ పరీక్షల్లో ఫలితం కేవలం 30 నిమిషాల్లోనే వస్తుంది. అయితే ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షా విధానంలో పాజిటివ్‌ గా తేలితే కరోనా పాజిటివ్‌ కేసుగా నిర్ధారిస్తారు. ఇక మరల పరీక్షించాల్సిన అవసరం ఉండదు. అదే ఫలితం నెగెటివ్‌ తేలితే పూర్తిస్థాయి నిర్ధారణ కోసం ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu