2023 సంవత్సరాన్ని ఉద్యోగ తెలంగాణగా ప్రభుత్వం మార్చింది – మంత్రి హరీశ్‌ రావు

Minister Harish Rao Says Telangana Govt Issues Recruitment Notifications For 81 Thousand Jobs,Minister Harish Rao,Says Telangana Govt Issues,Notifications For 81 Thousand Jobs,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,BRS President Thota Chandrasekhar,Thota Chandrasekhar

2023 సంవత్సరాన్ని ఉద్యోగ తెలంగాణగా ప్రభుత్వం మార్చిందని పేర్కొన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు. గురువారం ఆయన రూ. 20 కోట్లతో చేపట్టిన హాజీపురలో బస్తీ దవాఖానాకు శంకుస్థాపన, కోరుట్ల ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్‌ కేంద్రాన్ని మరో మంత్రి మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు విద్యాసాగర్‌రావు, జిల్లా కలెక్టర్‌ రవి మరియు పలువురు ఆరోగ్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 81 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తోందని వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల వలన దేశంలో నిరుద్యోగ రేటు 6 శాతం నుంచి 8.3 శాతానికి పెరిగిందని, అదే తెలంగాణలో కేవలం 4.1 మాత్రమే ఉందని చెప్పారు. నిరుద్యోగులకు ఊరటనిచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో దాదాపు 90వేల ఉద్యోగాలను ప్రకటించారని, ఈ మేరకు అప్పటినుంచి ప్రతి నెలా కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నామని మంత్రి తెలిపారు.

ఇక సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని, దీనిలో భాగంగానే ఆరోగ్య శాఖకు అధిక నిధులు కేటాయిస్తున్నారని, దాని ఫలితంగా నేడు తెలంగాణ రాష్ట్రం హెల్త్ సెక్టార్‌లో దేశంలోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్టేట్‌గా నిలిచిందని మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో 3 డయాలసిస్ సెంటర్లు ఉండగా, రాష్ట్రం ఏర్పడ్డాక వాటి సంఖ్యను 122కు పెంచామని, ఇంకా రాష్ట్రంలో 200 ఉన్న ఐసీయూ పడకలను 6 వేలకు పెంచామని వెల్లడించారు. ఇక మొత్తం కొత్తగా 950 మంది వైద్యులను నియమించామని, వీరిలో 90 మందిని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కేటాయించామని వెల్లడించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఒక్క వైద్య, ఆరోగ్య శాఖలో 6,431 డాక్టర్ పోస్టులు, 7600 స్టాఫ్ నర్సులు, 5192 పారా మెడికల్ సిబ్బంది సహా మరో 1,900 మంది ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 21,200 మంది కొత్త సిబ్బందిని నియమించామని కూడా మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 7 =