హైదరాబాద్‌లో డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలు

Drug Detection Tests In Hyderabad, Drug Detection, Drug Detection Tests, Hyderabad, New Year Celebrations, Drunken Drive, Drugs Detection Tests, Drugs, 31 St Night, New Year Celebrations Hyderabad,Hyderabad, Restrictions On News Year Celebrations, Cyberabad Police, Telangana News, Hyderbad News Updates, Mango News, Mango News Telugu
Hyderabad, New Year celebrations, Drunken drive, drugs detection tests

కొత్త సంవత్సరానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. మరొక్కరోజు గడిస్తే 2023కి గుడ్ బై చెప్పి.. 2024 సంవత్సరానికి స్వాగతం చెప్పబోతున్నాయి. ఈక్రమంలో న్యూ ఇయర్ వేడుకల కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున యువతీ యువకులు డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ కోసం గోవా, పాండిచ్చేరి, ముంబై వంటి ప్రాంతాలకు వెళ్తున్నారు. అటు లాంగ్ వీకెండ్ కూడా కలిసి రావడంతో.. శుక్రవారం రాత్రి నుంచే సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు.

ఇటు హైదరాబాద్ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ముస్తాబవుతోంది. పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లను నిర్వహకులు నూతన సంవత్సర వేడుకల కోసం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రేషన్స్ కోసం అడ్వాన్స్‌డ్ బుకింగ్ కూడా చేసేసుకున్నారు. మరోవైపు తెలంగాణలో కొత్తగా కొలుదీరిన కాంగ్రెస్ సర్కార్ శాంతి భద్రతలపై ఫోకస్ పెట్టింది. నిబంధనలను కఠినతరం చేసింది. ఇప్పటికే మాదకద్రవ్యాల ఉపయోగంపై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది.

ఈక్రమంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో.. డ్రగ్స్ డిటెక్షన్ టెస్ట్‌లు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ టెస్టులకు సంబంధించిన పరికరాలు నార్కోటిక్ పోలీసుల చేతికి అందాయి. ఒక్కో కమిషనరేట్‌కు 25 చొప్పున డ్రగ్ డిటెక్షన్ పరికరాలు అందాయి.  న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ డ్రగ్ డిటెక్షన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు నార్కో టిక్ బ్యూరో పోలీసులు చెబుతున్నారు.

ముందుగా పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయనున్నారు. ఆ టెస్ట్ పాజిటీవ్ వస్తే.. మరిన్ని డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు చేయనున్నారు. అవసరమయితే లాలాజలంతో పాటు మూత్ర పరీక్షలు కూడా చేయనున్నారు. ఆ పరీక్షల్లో పాజిటీవ్‌ వచ్చి సదరు వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే.. అతన్ని అదుపులోకి తీసుకోనున్నారు. పబ్బులు, ఈవెంట్‌ జరిగే ప్రదేశాల వద్ద పోలీసులు ఈ టెస్ట్ చేయనున్నారు. అయితే డ్రగ్స్ తీసుకున్న మూడు రోజుల తర్వాత కూడా టెస్ట్ చేస్తే బయటపడే అవకాశం ఉంది. ఈక్రమంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముగిసిన తర్వాత డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేసే అవకాశం  ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ