తెలంగాణ: రామగుండంలో భారీ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించి, జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

PM Modi Launches Green Energy Projects of NTPC Worth Over Rs 5200 Cr Including Floating Solar Plant in Ramagundam, Modi Launches Green Energy Projects of NTPC Worth Over Rs 5200 Cr Including Floating Solar Plant in Ramagundam, Green Energy Projects of NTPC Worth Over Rs 5200 Cr Including Floating Solar Plant in Ramagundam, PM Modi Launches Green Energy Projects of NTPC Worth Over Rs 5200 Cr, Floating Solar Plant in Ramagundam, PM Modi Launches Green Energy Projects Of NTPC, Green Energy Projects Of NTPC, NTPC green energy projects, green energy projects, green energy projects of NTPC worth over Rs 5200 crore, Green energy projects of NTPC launched by Prime Minister Narendra Modi, NTPC green energy projects News, NTPC green energy projects Latest News, NTPC green energy projects Latest Updates, NTPC green energy projects Live Updates, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారంరూ. 5,200 కోట్ల రూపాయల విలువైన ఎన్టీపీసీ యొక్క బహుళ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ మేరకు ఆయన ‘ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్య – పవర్ @2047’ ముగింపు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ ప్రాజెక్టులను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలో రూ. 423 కోట్ల వ్యయంతో, 100 మెగావాట్ల సామర్థ్యంతో, ఎన్టీపీసీ జలాశయంలోని 600 ఎకరాలలో ఎన్టీపీసీ నిర్మించిన దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ (నీటిపై తేలియాడే) సోలార్ పీవీ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దీనితో పాటు కేరళలోని 92 మెగావాట్ల కాయంకుళం ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్, రాజస్థాన్‌లో 735 మెగావాట్ల నోఖ్ సోలార్ ప్రాజెక్ట్, లేహ్‌లో గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్ మరియు గుజరాత్‌లో కవాస్ గ్రీన్ హైడ్రోజన్ నేచురల్ గ్యాస్ ప్రాజెక్ట్‌లకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇటువంటి పర్యావరణ సహిత దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు మన తెలంగాణలో ఉండటం మనందరికీ గర్వకారణం అని పేర్కొన్నారు. ఈరోజు మనం ప్రారంభించుకున్న ఈ ప్రాజెక్టులు రాబోయే 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టినవని వివరించారు. సోలార్ విద్యుత్ తో పాటు హైడ్రోజన్ గ్యాస్ వలన కలిగే ప్రయోజనాలు త్వరలోనే దేశ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. కొన్ని రాష్ట్రాలు విద్యుత్ సంస్థలు నాశల్లో కురుకుపోతున్నా ఇంకా సబ్సిడీలు కొనసాగిస్తున్నాయని, రాజకీయాలకు అతీతంగా విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసే ప్రక్రియలో అన్ని రాష్ట్రాలు కలిసి రావాలని కోరారు. అలాగే నాణ్యమైన విద్యుత్ అందించడానికి వివిధ ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఈ సంస్కరణల్లో భాగంగానే స్మార్ట్ మీటర్లు ప్రవేశ పెట్టామని ప్రధాని వెల్లడించారు.

40 బ్లాకులలో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఒక్కో బ్లాకులో 2.5 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. ఈ ప్రాజెక్టులో ఉపయోగించిన 4.5 లక్షలకు పైగా సోలార్ పీవీ ప్యానెళ్లను “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమం క్రింద దేశంలోనే తయారు చేయడం విశేషం. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా 31 వేలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. అంతేకాకుండా పర్యావరణ అనుకూలమైన ఈ ప్రాజెక్టు వలన సంవత్సరానికి 1.65 లక్షల టన్నుల బొగ్గు ఆదా అవుతుంది మరియు 2.1 లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలను నిరోధిస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + three =