తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు అదనంగా వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను అప్పగించారు. మంత్రి హరీశ్ రావుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను కేటాయిస్తూ, ఈ నియామకం నవంబర్ 9, 2021 నుండి అమల్లోకి వస్తుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అనంతరం ఆ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన అనంతరం వైద్య ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్ కు బదిలీ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచే సీఎం కేసీఆర్ వైద్య, ఆరోగ్య శాఖను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ బాధ్యతలను తాజాగా మంత్రి హరీశ్ రావుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ