‘బలగం’ మొగిలయ్యకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ‘దళితబంధు’ మంజూరు, పత్రాలు అందజేసిన కలెక్టర్‌

Dalit Bandhu Granted For Balagam Movie Fame Mogilaiah Warangal Collector Gave Documents,Dalit Bandhu Granted For Balagam Mogilaiah,Balagam Movie Fame Mogilaiah,Warangal Collector Gave Documents For Mogilaiah,Dalit Bandhu,Mango News,Mango News Telugu,Balagam Mogiliah Granted Dalit Bandhu,Balagam Mogilaiah,dalitha bandhu telangana,Balagam Movie Fame Mogilaiah Latest News,Balagam Movie Fame Mogilaiah Latest Updates,Balagam Movie Fame Mogilaiah Live News,Balagam Movie Fame Mogilaiah News Today

తెలంగాణ పల్లె జీవన విధానం, కుటుంబ బాంధవ్యాలు కథాంశంగా నటుడు వేణు ఎల్దండి దర్శకత్వంలో వచ్చిన ‘బలగం’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న గాయకుడు పస్తం మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకం మంజూరు చేసింది. ఈ మేరకు వరంగల్‌ కలెక్టర్‌ ప్రావీణ్య మంగళవారం మొగిలయ్య దంపతులను శాలువాతో సత్కరించి, దళిత బంధు మంజూరు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దళితబంధు పథకం మంజూరు చేయడంలో తోడ్పాటు అందించిన బీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులకు మొగిలయ్య, కొమురమ్మ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా ఉత్తర తెలంగాణలోని వరంగల్‌ జిల్లా దుగ్గొండిలో జన్మించిన మొగిలయ్య సంప్రదాయ కళాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. దీనిలో భాగంగా ఊరూరా తిరుగుతూ యక్షగానాలు, బుర్రకథలు చెప్పుకొంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో 60 ఏళ్ల వయస్సులో అనుకోకుండా బలగం సినిమాలో పాట పాడే అవకాశంతో పాటు ఆ పాటలో నటించడంతో మొగిలయ్య దంపతులకు గుర్తింపు లభించింది. అయితే గత కొంతకాలంగా మొగిలయ్య కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో రెండేళ్లుగా డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ఖరీదైన వైద్యం చేయించుకునే స్థోమత లేకపోవడంతో ఆరోగ్యం క్షీణించింది. ఈ నేపథ్యంలో ఆయన పరిస్థితి తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మొగిలయ్య కుటుంబ పరిస్థితి, అనారోగ్యం దృష్ట్యా సర్కారు స్పందించి దళితబంధు పథకం కింద మొగిలయ్యను ఎంపిక చేశారు. తద్వారా ఆయన కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + fifteen =