టీ20 ప్రపంచ కప్-2021: ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ మధ్య నేడే తోలి సెమీఫైనల్

1st Semifinal, ENG vs NZ, ENG vs NZ 1st Semifinal LIVE Score, ENG vs NZ LIVE Score, ENG vs NZ T20 WC 2021 semi-final, England and New Zealand Match, England vs New Zealand, England vs New Zealand Semi-Final 1, First Semifinal Between England and New Zealand, ICC T20 World Cup, ICC T20 World Cup 2021, Mango News, T20 WC, T20 World Cup, T20 World Cup-2021, Today First Semifinal Between England and New Zealand

టీ20 ప్రపంచ కప్-2021 సెమీ ఫైనల్స్ దశకు చేరుకుంది. నేడు తోలి సెమీ ఫైనల్ లో భాగంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటల నుంచి అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సూపర్-12 లో గ్రూప్-1 లో ఉన్న ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్ట్ ఇండీస్, బంగ్లాదేశ్ జట్లపై విజయం సాధించి సెమీస్ కు చేరుకుంది. ఇక సూపర్-12 లో గ్రూప్-2 లో ఉన్న న్యూజిలాండ్ జట్టు భారత్, ఆఫ్గనిస్తాన్, నమీబియా, స్కాట్లాండ్ జట్లపై విజయాలు నమోదు చేసి సెమీస్ కు చేరుకుంది. ఇరు జట్ల బలాబలాలు కూడా పటిష్టంగా ఉండడంతో సెమీఫైనల్-1 హోరాహోరీ సాగుతుందని క్రీడాభిమానులు, విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకూ ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ జట్లు అయిదు మ్యాచ్‌ల్లో తలపడగా, ఇంగ్లాండ్ మూడు, న్యూజిలాండ్‌ రెండు మ్యాచుల్లో గెలిచాయి. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఫైనల్ కు ఏ జట్టు చేరనుందో మరికొద్దీ గంటల్లో తేలనుంది.

ఇంగ్లాండ్ ప్రాబబుల్ జట్టు : జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్/డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

న్యూజిలాండ్ ప్రాబబుల్ జట్టు : మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోధీ, ట్రెంట్ బౌల్ట్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − eight =