రోహిత్‌ శర్మకు టీ20 పగ్గాలు, న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు భారత్ జట్టు ఇదే…

BCCI announce India squad for New Zealand T20I series, BCCI announces India squad for T20I series against New, BCCI Named Rohit Sharma as T20I Captain for India Squad, BCCI Named Rohit Sharma as T20I Captain for India Squad for T20Is Against New Zealand Announced, India vs New Zealand, India’s squad for NZ series announced, Mango News, Rohit Sharma named India T20I captain for New Zealand series, Rohit Sharma named India’s T20I captain, Rohit Sharma named new T20I captain, Rohit Sharma named T20 captain as India announce squad for NZ series, Rohit Sharma named Team India’s T20I captain for home, Rohit Sharma officially appointed T20I captain, T20Is Against New Zealand Announced

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2021 తర్వాత టీ20 కెప్టెన్ పదవి నుంచి తప్పుకోనున్నట్టు భారత క్రికెట్ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను నియమిస్తున్నట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం నాడు అధికారికంగా ప్రకటించింది. త్వరలో స్వదేశంలో న్యూజిలాండ్‌ తో జరగబోయే టీ20 సిరీస్‌ నుంచి పూర్తిస్థాయి టీ20 కెప్టెన్‌ గా రోహిత్‌ శర్మ తన ప్రస్థానాన్ని ప్రారంభించనున్నాడు.

అలాగే నవంబర్ 17న జైపూర్, 19న రాంచి, 21న కోల్ కతాలో న్యూజిలాండ్ తో జరిగే మూడు టీ20ల సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును కూడా ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్ లో వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇక విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా లకు విశ్రాంతి ఇవ్వగా, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిలపై సెలెక్టర్లు వేటు వేశారు. కాగా ఇటీవలి ఐపీఎల్ లో రాణించిన రుతురాజ్‌ గైక్వాడ్, హర్షల్‌ పటేల్ లకు జట్టులో చోటు కల్పించారు.

భారత్ టీ20 జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్, శ్రేయస్‌ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), వెంకటేశ్‌ అయ్యర్, యజువేంద్ర చహల్, ఆర్.అశ్విన్, అక్షర్‌ పటేల్, అవేశ్‌ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్‌ చహర్, హర్షల్‌ పటేల్, మహమ్మద్‌ సిరాజ్‌.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + ten =