సామూహిక నిమజ్జనాలు వద్దు, కోవిడ్-19 మార్గదర్శకాలు పాటిస్తూ గణేశ్‌ ఉత్సవాలు

bhagyanagar ganesh utsav samithi, bhagyanagar ganesh utsav samithi covid 19 guidelines, Bhagyanagar Utsav Samithi, Covid-19 Guidelines In Ganesh Immersion, ganesh chaturthi, ganesh chaturthi 2020, Ganesh Immersion Covid-19 Guidelines

నగరంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్-19 మార్గదర్శకాలు పాటిస్తూ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని భాగ్యనగర గణేశ్‌ ఉత్సవ సమితి నగర ప్రజలకు పిలుపునిచ్చింది. గణేశ్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, గణేష్ నిమజ్జనాల్లో భాగంగా సెప్టెంబర్‌ 1 న సామూహిక నిమజ్జనాలకు వీలుకాదని, సామాజిక దూరం పాటిస్తూ మార్గదర్శకాలకనుగుణంగా నిమజ్జనాలు జరుపుకోవాలని సూచించారు. అలాగే గణేష్ మండపాల వద్ద నలుగురు లేదా ఐదుగురే ఉండాలని, తప్పనిసరిగా మండపాల వద్ద శానిటైజర్లు, మాస్కులు వాడాలని కోరారు. గణేష్ విగ్రహాల ఎత్తుల గురించి ఎవరూ కూడా పోటీ పడొద్దని చెప్పారు. పండుగ సందర్భంగా గణేశుని పూజకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. అదే విధంగా ఉత్సవాల సమయంలో కమిటీలన్నీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =