కోవిడ్-19 కిట్స్: ఇప్పటికే 15 వేల ‘హోం ఐసోలేష‌న్ కిట్’‌ ల పంపిణీ

15000 Home Isolation Kits Distributed, Corona Updates in Telangana, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Free Home Isolation Kits, Free Home Isolation Kits In Telangana, GHMC Commissioner, Hyderabad, telangana, Telangana Coronavirus, telangana government

కోవిడ్‌-19 పాజిటివ్ గా నిర్థార‌ణ అయిన‌ప్ప‌టికీ ఇంటి వ‌ద్ద‌నే ఉంటూ వైద్య సేవ‌లు పొందుతున్నవారికి హోం ఐసోలేష‌న్ కిట్‌ల‌ను అంద‌జేస్తున్న‌ట్లు జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. జీహెచ్‌ఎంసీ ద్వారా 20వేల హోం ఐసోలేష‌న్ కిట్‌ల‌ను తెప్పించిన‌ట్లు ఆయన తెలిపారు. వాటిలో ఇప్పటికే 15 వేల హోం ఐసోలేష‌న్ కిట్‌ల‌ను పంపిణీ చేసిన‌ట్లు తెలిపారు. మ‌రో 5 వేల కిట్‌లు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న‌ట్లు తెలిపారు. కేసుల సంఖ్య‌ను బ‌ట్టి హోం ఐసోలేష‌న్ కిట్‌ల‌ను తెప్పించి హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌వారంద‌రికీ కిట్‌లు అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు.

కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాల ప్ర‌కారం 17 రోజుల పాటు హోం ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని తెలిపారు. అందుక‌నుగుణంగా తొంద‌ర‌గా కోలుకునేందుకు దోహ‌ద‌ప‌డే తొమ్మిది ర‌కాల వ‌స్తువులను కిట్ కింద అందజేస్తున్నట్టు తెలిపారు. అలాగే హోం ఐసోలేష‌న్ కిట్ క‌వ‌ర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ ను సెల్ ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే కేంద్ర ప్ర‌భుత్వం కోవిడ్‌-19 నియంత్ర‌ణ‌కు జారీచేసిన స‌ల‌హాలు, సూచ‌న‌లు ల‌భిస్తాయ‌ని తెలిపారు. జీహెచ్‌ఎంసీ జోన‌ల్ క‌మిష‌న‌ర్లు, డిప్యూటి క‌మిషన‌ర్లు ఆయా ప్రాంతాల మెడిక‌ల్ ఆఫీస‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆరోగ్య సిబ్బంది ద్వారా పాజిటివ్ కేసులు న‌మోదైన ఇళ్ల‌లో ఈ కిట్లను నేరుగా అంద‌జేస్తున్న‌ట్లు లోకేష్ కుమార్ తెలిపారు.

హోం ఐసోలేష‌న్ కిట్‌ వివరాలు:

  • విట‌మిన్‌-సి టాబ్లెట్లు-34
  • జింక్ టాబ్లెట్లు-17
  • బి-కాంప్లెక్స్ టాబ్లెట్లు -17
  • మాస్కులు – 6
  • శానిటైజ‌ర్ బాటిల్‌-1
  • హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్‌-1
  • గ్లౌజ్‌లు – రెండు జతలు
  • సోడియం హైపోక్లోరైట్ ద్రావణం బాటిల్ -1
  • హోం ఐసోలేష‌న్ బ్రోచ‌ర్‌ – 1

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu