గ్రేటర్ పోలింగ్: ఓటర్ కార్డు లేకుంటే, 18 రకాల గుర్తింపు కార్డులతో ఓటువేసే అవకాశం

GHMC Elections: 18 Alternative Identity Cards Recognised for Voting

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. ఇప్పటికే నగరంలోని 150 డివిజన్లలో ఓటరు స్లిప్పుల పంపిణీ కార్యక్రమం పూర్తయింది. రేపు గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొనే వారు పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు స్లిప్పుతో పాటుగా ఓటరు గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓటర్ గుర్తింపు కార్డు లేకుంటే అందుకు ప్రత్యామ్నాయంగా 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును చూపించి ఓటుహక్కును వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

18 రకాల గుర్తింపు కార్డుల వివరాలు ఇవే:

  1. ఆధార్ కార్డు
  2. పాస్‌‌‌‌పోర్ట్‌‌‌‌
  3. రేషన్ కార్డు
  4. పాన్ కార్డు
  5. డ్రైవిం గ్ లైసెన్స్‌
  6. కేంద్ర, రాష్ట్ర ప్రభు‌త్వాలు లేదా ప్రభుత్వ రంగ సంస్థలు జారీచేసిన సర్వీస్ ఐడెంటిటీ కార్డ్
  7. ఫొటోతో కూడిన బ్యాంకు పాస్‌‌‌‌బుక్‌
  8. ఎన్‌‌‌‌పీఆర్ స్మార్ట్ కార్డు
  9. ఉపాధి హామీ జాబ్ కార్డు
  10. హెల్త్ కార్డు
  11. ఫొటోతో కూడిన పింఛన్‌‌‌‌ డాక్యుమెంట్
  12. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు అయితే వారికీ జారీచేసిన అధికార గుర్తింపు పత్రం
  13. కుల ధృవీకరణ పత్రం
  14. స్వాతంత్య్ర సమరయోధుల గుర్తింపు కార్డు
  15. ఆయుధ లైసెన్స్ కార్డు
  16. అంగవైకల్య ధ్రువీకరణ ​సర్టిఫికెట్
  17. లోక్ సభ, రాజ్యసభ సభ్యులైతే వారి ఐడెంటిటీ కార్డు
  18. పట్టదారు పాస్ బుక్
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ