జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. ఇప్పటికే నగరంలోని 150 డివిజన్లలో ఓటరు స్లిప్పుల పంపిణీ కార్యక్రమం పూర్తయింది. రేపు గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనే వారు పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు స్లిప్పుతో పాటుగా ఓటరు గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓటర్ గుర్తింపు కార్డు లేకుంటే అందుకు ప్రత్యామ్నాయంగా 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును చూపించి ఓటుహక్కును వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
18 రకాల గుర్తింపు కార్డుల వివరాలు ఇవే:
- ఆధార్ కార్డు
- పాస్‌పోర్ట్
- రేషన్ కార్డు
- పాన్ కార్డు
- డ్రైవిం గ్ లైసెన్స్
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ప్రభుత్వ రంగ సంస్థలు జారీచేసిన సర్వీస్ ఐడెంటిటీ కార్డ్
- ఫొటోతో కూడిన బ్యాంకు పాస్‌బుక్
- ఎన్‌పీఆర్ స్మార్ట్ కార్డు
- ఉపాధి హామీ జాబ్ కార్డు
- హెల్త్ కార్డు
- ఫొటోతో కూడిన పింఛన్ డాక్యుమెంట్
- ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు అయితే వారికీ జారీచేసిన అధికార గుర్తింపు పత్రం
- కుల ధృవీకరణ పత్రం
- స్వాతంత్య్ర సమరయోధుల గుర్తింపు కార్డు
- ఆయుధ లైసెన్స్ కార్డు
- అంగవైకల్య ధ్రువీకరణ సర్టిఫికెట్
- లోక్ సభ, రాజ్యసభ సభ్యులైతే వారి ఐడెంటిటీ కార్డు
- పట్టదారు పాస్ బుక్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ