శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి

latest political breaking news, Mango News Telugu, National Politics, Political Updates 2019, President Ram Nath Kovind, Ram Nath Kovind Arrives Hyderabad, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates 2019
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది కోసం డిసెంబర్ 20, శుక్రవారం నాడు హైదరాబాద్‌ చేరుకున్నారు. ముందుగా ఢిల్లీ నుంచి వాయుసేన విమానంలో హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్ స్టేషన్ కు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ నెల 28వరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 21, 22 తేదీల్లో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కోవింద్‌ బస చేస్తారు. డిసెంబర్ 22 ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై ఏర్పాటు చేసే విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ఈ 23 నుంచి 26 వరకు చెన్నై, పుదుచ్చేరి, తిరువనంతపురంలో రాష్ట్రపతి పర్యటించనున్నారు. తిరిగి ఈ నెల 26 సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. అలాగే డిసెంబర్ 27న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం నిర్వహిస్తారు. డిసెంబర్ 28, శనివారం మధ్యాహ్నం 3:15 గంటలకు హకీంపేట నుంచి రాష్ట్రపతి డిల్లీకి బయలుదేరి వెళతారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =