వరద ప్రభావం: అర్హులైన లబ్దిదారులను గుర్తించండి -హోమ్ మంత్రి

Home Minister Mahmood Ali Meeting with GHMC Deputy Commissioners

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వారిని గుర్తించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెఛ్ఎంసీ) పాతబస్తీకి చెందిన అధికారులను రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ మంగళవారం నాడు ఆదేశించారు. ఆజంపూరలోని తన నివాసంలో పాతబస్తీకీ చెందిన డిప్యుటీ కమీషనర్లతో హోమ్ మంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హోం మంత్రి మాట్లాడుతూ వరద బాధితులకు ఉపశమనం ఇవ్వడంలో సంబంధిత అధికారుల పాత్ర చాలా ముఖ్యమైనదని, లబ్దిదారుల గుర్తింపు ఆధారంగా రిలీఫ్ డబ్బు అందించబడుతుందని తెలియజేశారు.

వరద బాధితులకు ఆర్ధిక సహాయాన్ని పంపిణీ చేస్తున్న సమయంలో కొన్ని ప్రాంతాలలో నిజమైన వరద బాధితులకు ఈ డబ్బు పంపిణీ చేయలేదని ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ విషయంలో అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. భారీ వర్షాలలో ఇళ్లు దెబ్బతిన్నా, కోల్పోయిన వారిని మాత్రమే లబ్దిదారులుగా ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్లు రజనీ కాంత్ రెడ్డి, రిచా గుప్తా, సూర్య కుమార్, జగన్, మంగతాయారు, తదితరులు ఈ సమావేశం లో పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ