తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాల నుంచి హుజురాబాద్ బీజేపీ ఈటల రాజేందర్ సస్పెండ్ అయ్యారు. ముందుగా మంగళవారం ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే తొలిరోజు సమావేశాల అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై ఈటల రాజేందర్ వ్యాఖల అంశాన్ని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సభలో లేవనెత్తారు. స్పీకర్ పై అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఈటల రాజేందర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటలను సస్పెండ్ చేయాలంటూ మరికొందరు ఎమ్మెల్యేలు కూడా నినాదాలు చేశారు.
రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, సభకు హాజరైన ఈటల రాజేందర్ ను ఉద్దేశిస్తూ ఆయన సభాపతిపై అభ్యంతర వ్యాఖ్యలు చేసారని, క్షమాపణ చెప్పి చర్చలో పాల్గొనాలన్నారు. గతంలోనూ ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేయించుకున్నారని చెప్పారు. ఈటల క్షమాపణలు చెప్పి, సభలో ఉండి చర్చ చేయాలని తాము కోరుకుంటున్నామని పేర్కొన్నారు. కాగా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ ఈటల అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం సభ నుంచి ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఈ సమావేశాలు ముగిసేంతవరకు సభ నుండి ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. స్పీకర్ నిర్ణయం అనంతరం ఈటల సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY






































