తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై ఉన్నతస్థాయి అధికారుల సమావేశం

CS Somesh Kumar DGP Mahender Reddy Reviewed Arrangements for Telangana Jathiya Samaikyatha Vajrotsavalu, CS Somesh Kumar, DGP Mahender Reddy, Telangana Jathiya Samaikyatha Vajrotsavalu, Jathiya Samaikyatha Vajrotsavalu, Mango News, Mango News Telugu, CS And DGP Reviews Telangana Day Arrangements, Telangana Day, Telangana Day 2022, Telangana Jathiya Samaikyatha Vajrotsavalu 2022, Telangna CM KCR, Telangna Day Latest News And Live Updates, Telangana

సెప్టెంబర్ 16 ,17 ,18 తేదీల్లో నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సోమవారం సాయంత్రం ఉన్నత స్థాయి అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి సహా పలువురు సీనియర్ శాఖాధికారులు హాజరయ్యారు. ఈనెల 17వ తేదీ ఉదయం హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని, అనంతరం నగరంలోని బంజారాహిల్స్ లో నిర్మించిన కొమరంభీం ఆదివాసీ భవన్ ను, సేవాలాల్ బంజారా భవన్ లను ప్రారంభిస్తారని సీఎస్ తెలిపారు. ఈ ప్రధాన కార్యక్రమాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. అదే రోజు సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియంలో లక్షకి పైగా గిరిజన ప్రజాప్రతినిధులు, అధికారులు, గిరిజన యువకులు పాల్గొనే బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రధానంగా సభా స్థలంలో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర జిల్లాలనుండి వచ్చే వాహనాలకు సరైన పార్కింగ్ సదుపాయం, శానిటేషన్, పీఏ సిస్టం ఏర్పాటు, తగు భద్రతా చర్యలను చేపట్టాలని సీఎస్ సూచించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, అదనపు డీజీ ఎల్‌ అండ్‌ ఓ జితేందర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్, జైళ్ల శాఖ అదనపు డీజీ సంజయ్ జైన్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, ఉన్నత విద్యా శాఖ కమీషనర్ నవీన్ మిట్టల్, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ ఎం.దాన కిషోర్, తదితర అధికారులు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 8 =