బీఆర్ఎస్‌కు ఈ ఎన్నికలకు కూడా కష్టమేనా..?

Lok sabha elections, Telangana, Congress, BRS, TDP, YSRTP, TJS, Revanth Reddy News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates, Mango News Telugu, Mango News
Lok sabha elections, Telangana, Congress, BRS

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేడి భగ్గుమంటోంది. అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలయిపోయింది. అని పార్టీలు లోక్ సభ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టేశాయి. ఇప్పటికే లోక్ సభ నియోకవర్గాల వారీగా బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు పూర్తి చేసింది. ఇక పార్లమెంట్ సమావేశాల నుంచి నరుక్కొచ్చేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. అటు ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కాంగ్రెస్ కూడా దూకుడు పెంచేసింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించారు.

అయితే కాంగ్రెస్ ఇంద్రవెల్లి సభతో తెలంగాణలో ఎన్నికలు ఏకపక్షంగా మారినే సందేహం లేదనే చర్చ తెరపైకి వచ్చింది. అవును.. ఇంద్రవెల్లి సభకు జనాల నుంచి వచ్చిన స్పందన.. కాంగ్రెస్ దూకుడు.. రేవంత్ రెడ్డి వ్యూహాలను చూస్తుంటే ఏకపక్షం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి దాదాపు నెలరోజులు కావొస్తోంది. ఇప్పటి వరకు కూడా ఒక్క నెగిటీవ్ మార్క్ కూడా రాలేదు. పైగా అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేసింది. మహాలక్ష్మీ పథకానికి జనాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఇది కాంగ్రెస్‌కు బాగా కలిసొస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అదే సమయంలో మిగిలిన గ్యారెంటీలను కూడా ఎన్నికల లోపు అమలు చేస్తే.. కాంగ్రెస్‌కు ఎదరు లేదనే మాట వినిపిస్తోంది. ముందు నుంచి కూడా బీఆర్ఎస్ సర్కార్‌పై ఎక్కడైతే వ్యతిరేకత ఉందో.. అక్కడే మార్కులు దక్కించుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఆ విషయాల్లో ఇప్పటి వరకు సక్సెస్ కూడా అయ్యారు.

అసలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో సందేహంగానే కాంగ్రెస్‌కు ఓట్లు పడ్డాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో.. ఆయన ఫేస్ వాల్యూతోనే ఎకపక్షంగా నెట్టుకొచ్చినా అందులో ఎటువంటి సందేహం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఎన్నికలు కూడా ఈసారి బీఆర్ఎస్‌కు కష్టమేనని చెబుతున్నారు. మరి చూడాలి ముందు ముందు బీఆర్ఎస్ ఎటువంటి ఎత్తుగడలు వేస్తుందో…

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE