గోదావరి జిల్లాలపైకి జగన్ బీసీ బాణం

CM Jagan, YCP, AP Elections, Godavari districts, Uttarandhra, YSRC, godavari news, Andhra Pradesh, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
CM Jagan, YCP, AP Elections, Godavari districts

ఎన్నికలవేళ ఏపీలో ప్రధాన పార్టీలన్నీ సరికొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ఎత్తుగడలు వేస్తున్నాయి. రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ ముందుకు వెళ్తుంటే.. అటు జగన్ సర్కార్‌ను గద్దె దించి అధికారం దక్కించుకోవాలని జనసేన-టీడీపీలు పావులు కదుపుతున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో గోదావరి జిల్లాలు అత్యంత కీలకంగా మారడంతో ప్రధాన పార్టీలన్నీ ఆ జిల్లాలపై కన్నేశాయి. అటు జనసేన-టీడీపీకి గోదావరి జిల్లాల్లో కావాల్సినంత బలం ఉంది. ఈక్రమంలో జగన్మోహన్ రెడ్డి బీసీ బాణాన్ని గోదావరి జిల్లాలపైకి వదిలేందుకు సిద్ధమవుతున్నారు.

గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. ఆ తర్వాత బీసీలు ఎక్కువ మంది ఉన్నారు. ఈక్రమంలో బీసీలను సమీకృతం చేసేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం గోదావరి జిల్లాల్లోవున్న మొత్తం 34 స్థానాల్లో కొన్ని స్థానాలు కాపులకు కేటాయించి మిగిలిన స్థానాల్లో బీసీ అభ్యర్థులను బరిలోకి దించాలని జగన్ ఆలోచిస్తున్నారు. జగ్గంపేట, భీమవరం, తణుకు, పిఠాపురం, ప్రత్తిపాడు స్థానాలను ఎప్పటిలానే కాపు నేతలకే కేటాయించనున్నారట.

ఇక ఈసారి నర్సాపురం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దించేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారట. ఈ మేరకు బలమైన నేత కోసం జల్లెడ పడుతున్నారట. ఈ స్థానం నుంచి బీసీని బరిలోకి దించడం ద్వారా.. ఆ పార్లమెంట్ స్థానం పరిధిలోవున్న పెద్ద ఎత్తున బీసీ ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చని జగన్ భావిస్తున్నారట. అలాగే ఆ నియోజకవర్గంలో అత్యధిక శాతం మహిళా ఓటర్లే ఉండడంతో.. మహిళా అభ్యర్థినే బరిలోకి దించేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారని సంబంధిత వర్గాలుచెబుతున్నాయి. అటు ఆచంట, రాజమండ్రి స్థానాల నుంచి కూడా బీసీలనే బరిలోకి దించేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారట. మరి గోదావరి జిల్లాల్లో జగన్ బీసీ బాణం టార్గెట్‌ను గుచ్చుకుంటుందా? లేదా? అనేది చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + seven =