హైదరాబాద్ వాహనదారులకు శుభవార్త.. పెండింగ్ చ‌లాన్లపై డిస్కౌంట్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీస్

Hyderabad Traffic Police Announces Special Discount on Pending E-Challans, Traffic Police Announces Special Discount on Pending E-Challans, Hyderabad Traffic Police, Traffic Police, Special Discount on Pending E-Challans, Pending E-Challans, E-Challans, huge discounts on pending traffic challans, traffic challans, TS Traffic Challan Discount, Hyderabad Traffic Challan Discount, Traffic Challan Discount, Challan Discount, traffic violation challan, challan, Challan Discount, Discount, Mango News, Mango News Telugu,

నగర వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుభవార్త చెప్పారు. ద్విచక్రవాహనాలకు సంబంధించిన పెండింగ్‌ చలాన్లపై 75% వరకు రాయితీ ఇస్తున్నట్లు ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ వెల్లడించారు. వాహనదారులు ఆన్‌లైన్‌ ద్వారా పెండింగ్ చలాన్ల చెల్లింపులు చేయవచ్చని తెలిపారు. చలాన్లపై ప్రకటించిన రాయితీ మార్చి 1 నుంచి 30 వరకు మాత్రమే అని స్పష్టం చేశారు. ఇప్పటివరకు హైదరాబాద్‌ నగరంలో 1.75 లక్షల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. భారీ రాయితీల వలన వాహనదారులకు ఉపశమనం కలుగనున్నట్లు తెలిపారు. ఈ అద్భుత అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని సీపీ వాహనదారులకు సూచించారు.

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మరియు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు రెండు కమిషనరేట్‌లలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్ చెల్లింపులపై ‘వన్-టైమ్ డిస్కౌంట్’ ప్రకటించారు. దీని వలన గతంలో మాస్క్ ధరించని వ్యక్తులకు రూ.1000 ఫైన్‌ ఉండగా.. ప్రస్తుతం రాయితీ అనంతరం కేవలం రూ.100 కడితే సరిపోతుందని, రూ.900 వరకు మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, ఈ చ‌లాన్ల చెల్లింపున‌కు ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే, మీ సేవ‌, ఈ సేవ‌ వంటి సేవలు వినియోగించుకోవచ్చు అని చెప్పారు. ఆర్టీసీ బస్‌లకు 70%, లైట్‌ మోటార్‌ వేహికిల్‌, భారీ మోటార్‌ వాహనాలకు 50%, తోపుడు బండ్లకు 75% వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 5 =