బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తుతం రాష్ట్రంలో ఐదో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపడుతున్న సంగతి తెలిసిందే. నేటితో ఐదో విడత పాదయాత్ర 15వ రోజుకు చేరుకోగా, డిసెంబర్ 15వ తేదీన కరీంనగర్ లో యాత్రను ముగించనున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 15 తేదీ మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్ లోని ఎస్.ఆర్.ఆర్ కాలేజీ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది. ఈ పాదయాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టుగా ప్రకటించారు.
జేపీ నడ్డా హాజరు కానున్న నేపథ్యంలో ఈ సభను భారీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయడంతో పాటుగా, జన సమీకరణ సహా ఇతర అంశాలపై రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు ఇప్పటికే రంగంలోకి దిగారు. మునుగోడులో ఓటమి, ఐదో విడత పాదయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల అనంతరం ఈ సభ జరుగుతుండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని, విజయవంతంగా నిర్వహించడంపై బీజేపీ నేతలు దృష్టి సారించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE