ట్రాఫిక్, రహదారి భద్రతా నిబంధనలు పాటించ‌డం అన్నింటిక‌న్నా ముఖ్యం: ఎన్టీఆర్

2021 Cyberabad Traffic Police Annual Conference, Cyberabad Traffic Police Annual Conference, Cyberabad Traffic Police Annual Conference Event, Jr NTR, Jr NTR as the Guest of Cyberabad Traffic Police Event, Jr Ntr at Cyberbad Traffic Police first Annual Conference, Jr NTR LIVE, Jr NTR Participated in Cyberabad Traffic Police, Jr NTR Participated in Cyberabad Traffic Police Annual Conference Event, Jr NTR Very Emotional Speech About Road Safety, Mango News

ప్రముఖ సినీ నటుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ బుధవారం నాడు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక సమావేశంలో అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ‌తో పాటుగా పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముందుగా సైబ‌రాబాద్ పోలీసుల‌ పెట్రోలింగ్ వాహ‌నాల‌ను ఎన్టీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అలాగే రోడ్ సేఫ్టీపై నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.

సినీన‌టుడిగా కాదు… ఓ పౌరుడిగా ఇక్క‌డకు వ‌చ్చా:

ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ భావోద్వేగానికి గుర‌య్యారు. “నేను ఇక్క‌డికి ఓ సినీన‌టుడిగా రాలేదు. రోడ్డు ప్ర‌మాదాల్లో ఇద్ద‌రు కుటుంబ స‌భ్యుల‌ను కోల్పోయిన ఓ పౌరుడిగా ఇక్క‌డకు వ‌చ్చాను. ట్రాఫిక్, రహదారి భద్రతా నిబంధనలను పాటించ‌డం అన్నింటి క‌న్నా ముఖ్య‌మైన విష‌యం” అని ఎన్టీఆర్ చెప్పాడు. అవ‌గాహ‌న కోసం పోలీసులు అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నార‌ని తెలిపాడు. ర‌హ‌దారుల‌పై అంద‌రూ ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను పాటించి మ‌ళ్లీ సుర‌క్షితంగా ఇంటికి వెళ్లాల‌ని ఎన్టీఆర్ పిలుపునిచ్చాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ