విశాఖ ఉక్కు పరిశ్రమపై అసెంబ్లీలో తీర్మానం, కార్మిక సంఘాలతో సీఎం జగన్ భేటీ

AP CM YS Jagan, AP CM YS Jagan Meets Representatives of Steel Plant Workers, Centre Decision on Privatisation of Visakhapatnam Steel Plant, Centre nod to privatisation of Vizag Steel Plant, Mango News, Privatisation of Visakhapatnam Steel Plant, privatisation of Vizag Steel Plant, Steel Plant Workers Unions, Steel Plant Workers Unions in Visakhapatnam, Visakhapatnam, Visakhapatnam Steel Plant, Visakhapatnam Steel Plant Issue, Visakhapatnam Steel Plant News, YS Jagan Mohan Reddy Meets Union Leaders

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి బుధవారం నాడు విశాఖపట్నంలో పర్యటించారు. ముందుగా విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎన్‌ జగన్‌ విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న‌ కార్మిక సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల ప్రతినిధులు సీఎంకు వినతిపత్రం అందించారు. అలాగే ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయంలో ఎలాంటి మార్పు రాకుంటే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని వారికీ సీఎం వైఎస్ జగన్ తెలిపినట్టు సమాచారం. సుమారు గంటపాటుగా కోనసాగిన ఈ సమావేశంలో విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ అంశంపై కీలకంగా చర్చించినట్టు తెలుస్తుంది.

అనంతరం అక్కడి నుంచి పెందుర్తి మండలం చినముషిడివాడలో శ్రీ శారదా పీఠానికి సీఎం వైఎస్ చేరుకున్నారు. శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న తొలి రోజు కార్యక్రమంలో సీఎం‌ పాల్గోన్నారు. నేటి నుంచి శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు ప్రారంభమవ్వగా, పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిల ఆధ్వర్యంలో అయిదు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. మరోవైపు సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా విశాఖనగరంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =