సంగారెడ్డిజిల్లా పటాన్‌చెరు పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ భారీగా ఎగసిపడడంతో చుట్టుపక్కల ప్రాంతంలోని స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ముందుగా పారిశ్రామికవాడలోని ఓ పెయింట్ పరిశ్రమలో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తుంది. అనంతరం పక్కనే ఉన్న కెమికల్ కంపెనీకి మంటలు వ్యాపించడంతో అక్కడున్న కెమికల్ డ్రమ్ములు కూడా భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలిపోవడంతో మంటలు పెరిగి ప్రమాద తీవ్రత పెరిగినట్టుగా తెలుస్తుంది. సంబంధిత కంపెనీలో పని చేసే సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఆ ప్రాంతంలోని ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ