మేడారం జాతరకు హాజరుకావాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు ఆహ్వానపత్రిక అందజేత

Medaram Sammakka Saralamma Jathara: Ministers Handed over Invitation for Jathara to CM KCR

తెలంగాణలో శ్రీ సమ్మక్క–సారలమ్మల మహా జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభమవుతున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరు కావాలని కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు రాష్ట్ర మంత్రులు, జాతర ధర్మకర్తల మండలి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. మంగళవారం ప్రగతి భవన్ లో రాష్ట్ర గిరిజన,మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టినా, ఎండోమెంట్స్ కమిషనర్ అనిల్ కుమార్, మేడారం దేవాలయ ఈవో రాజేందర్, జాతర ధర్మకర్తల మండలి చైర్మన్ కొర్నిబెల్లి శివయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, బడే నాగజ్యోతి, దుర్గం రమణయ్య, తదితరులు సీఎం కేసీఆర్ ను కలిసి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ