ప్రధాని మోదీ.. తెలంగాణ, ఏపీని మళ్ళీ కలుపుతారేమో? మంత్రి తలసాని ఆసక్తికర వ్యాఖ్యలు

Congress call out Modi’s insult over Telengana formation, Mango News, Minister Talasani Srinivas Yadav, PM insulted Telangana, PM Modi Comments on Telangana Formation Procedure, PM Modi To Reunite Telangana and AP, PM Modi To Reunite Telangana and AP Interesting Comments, PM Modi To Reunite Telangana and AP Interesting Comments By Minister Talasani Srinivas Yadav, PM Modi’s words on Telangana, Protests erupt across Telangana against PM Modi, talasani srinivas yadav, TRS, TRS angry over Modi’s remarks

ప్రధాని మోదీ.. తెలంగాణ, ఏపీని మళ్ళీ కలుపుతారేమో? అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న రాజ్యసభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని మంత్రి ప్రశ్నించారు. విభజన జరిగి 8 సంవత్సరాలు అవుతుంటే.. ఇప్పటివరకు ప్రధాని ఎం చేశారని? ప్రశ్నించారు. ఈ ఎనిమిదేళ్ళు మోదీ గుడ్డి గుర్రాల పళ్ళు తోమారా అని ఎద్దేవా చేశారు. దేశ సమాఖ్య స్ఫూర్తికి ప్రధాని వ్యాఖ్యలు పూర్తిగా వ్యతిరేకమని, ప్రజాస్వామ్యంపై బీజేపీకి ఏమాత్రం నమ్మకం లేదని తేలిపోయిందని మంత్రి తలసాని అన్నారు.

ప్రధాని మోదీ వైఖరి చూస్తుంటే తెలంగాణ, ఏపీని మళ్ళీ కలుపుతారేమోనని అనుమానం వస్తోందన్నారు. ఏ విభజన స్ఫూర్తితో లోయర్ సీలేరు ప్రాజెక్ట్ సహా, ఏడు మండలాలను ఆనాడు ఆంధ్ర లో కలిపారు? ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు? అని మంత్రి తలసాని ప్రశ్నించారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్న బిజెపి.. ఇప్పుడు తెలంగాణపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం పద్దతిగా లేదని మంత్రి అన్నారు. మోదీ ప్రధానమంత్రి గా ఉండి అలా మాట్లాడడం దురదృష్టకరం, తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే, సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశ వ్యాప్తంగా ఉద్యమిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − ten =