భారీ వర్షాల నేపథ్యంలో జూలై 13న జరగాల్సిన టీఎస్ ఈసెట్‌-2022 ప్రవేశ పరీక్ష వాయిదా

TS ECET-2022 Examination Scheduled on July 13 is Postponed due to Heavy Rains in the State, ECET-2022 Examination Scheduled on July 13 is Postponed due to Heavy Rains in the State, TS ECET-2022 Examination Scheduled on July 13 is Postponed, Telangana ECET 2022 exam which was scheduled to be held on July 13 has been postponed, Telangana ECET 2022 exam has been postponed, TS ECET 2022 exam has been postponed, TS ECET 2022 postponement, Telangana ECET 2022 postponed New exam date soon, TS ECET 2022 has been postponed due to heavy rains In Telangana, Telangana State Council of Higher Education decided to postpone the TS ECET-2022, TSCHE decided to postpone the TS ECET-2022, TS ECET-2022, 2022 TS ECET, TS ECET 2022 exam postponed News, TS ECET 2022 exam postponed Latest News, TS ECET 2022 exam postponed Latest Updates, TS ECET 2022 exam postponed Live Updates, Mango News, Mango News Telugu,

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు జూలై 11 నుండి జూలై 13 వరకు మూడు రోజుల పాటుగా సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 13న జరగాల్సిన ఈసెట్‌-2022 ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్‌ లింబాద్రి ప్రకటించారు. ఇక జూలై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్ ప‌రీక్ష, జూలై 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ ఇంజ‌నీరింగ్‌ పరీక్ష యథావిధిగా నిర్వహించనున్నట్టు తెలిపారు.

ముందుగా వర్షాలతో ఏర్పడ్డ పరిస్థితులు, సెలవులు ప్రకటన దృష్ట్యా ఈసెట్‌-2022, ఎంసెట్-2022 ప్రవేశ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ఉన్నత విద్యామండలి సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్‌ లింబాద్రి మరియు వైస్ చైర్మన్, జేఎన్టీయూ వైస్-ఛాన్సలర్, టీఎస్ ఎంసెట్-2022 కన్వీనర్, టీఎస్ ఈసెట్-2022 కన్వీనర్, సంబంధిత ఇతర సీనియర్లు అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితులపై వివిధ అంశాలు చర్చించబడ్డాయని, టీఎస్ ఎంసెట్-2022 పరీక్షను ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే అనగా జూలై 14, 2022 నుండి నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. అయితే జూలై 13న జరగాల్సిన టీఎస్ ఈసెట్-2022 పరీక్ష నిర్వహణ వాయిదా వేయబడిందని, రీషెడ్యూల్ చేయబడిన తేదీ తర్వాత తెలియజేయబడుతుందని తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ మేరకు చైర్మన్ ప్రొఫెసర్‌ లింబాద్రి ఒక ప్రకటన విడుదల చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =