కరోనాపై తెలంగాణ తీసుకుంటున్న చర్యల పట్ల కేంద్రమంత్రి సంతృప్తి: మంత్రి ఈటల

Eatala Rajender, Minister Eatala Rajender, Minister Eatala Rajender Meeting, Minister Eatala Rajender Video Conference, Telangana Health Minister Eatala Rajender, Union Health Minister, Union Health Minister DR Harsh Vardhan, Union Health Minister Video Conference

దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సోమవారం నాడు అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ, కరోనాపై తెలంగాణ తీసుకుంటున్న చర్యల పట్ల కేంద్రమంత్రి హర్షవర్ధన్ సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. పలు అంశాల్లో రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. “తెలంగాణకి ఇంకా కేంద్రం సపోర్ట్ కావాలి. ఇప్పటి వరకు తెలంగాణ లో 48 లక్షల టెస్టులు చేయడం జరిగింది. అందులో 5శాతం మాత్రమే పాజిటివ్ వచ్చింది. 2.5లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 19వేల ఆక్టీవ్ కేసులు ఉన్నాయి. డెత్ రేట్ 0.55శాతంగా ఉంది” అని తెలిపారు.

ముందు రోజుల్లో కరోనా కేసులు పెరిగినా ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు:

“డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ మరియు సిహెఛ్సీ, పీహెఛ్సీ, సబ్ సెంటర్స్ అన్ని చోట్లా కరోనా టెస్టులు చేస్తున్నాం. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతలేదు,అన్ని హాస్పిటల్స్ లో లిక్విడ్ ఆక్సిజన్ సీలిండర్స్ అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల ట్రీట్మెంట్ సౌకర్యాలు సమకూర్చుకున్న హాస్పిటల్స్ లో 12-15శాతం బెడ్స్ మాత్రమే ప్రస్తుతం అక్యుపెన్సీ ఉన్నాయి. ముందు ముందు రోజుల్లో కరోనా కేసులు పెరిగినా కూడా ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా ఎర్పాట్లు చేసుకున్నాం. రాష్ట్ర వైద్య సిబ్బంది అంత సిద్ధంగా ఉన్నామని” మంత్రి పేర్కొన్నారు. అలాగే వ్యాక్సిన్ కి సంబంచిన డీటెయిల్స్ మరియు సప్లై అండ్ ప్రియార్టీ కి సంబంధించిన సమాచారం కూడా తెలంగాణకు ఇవ్వాలని మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ను కోరారు. ఈ సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ తో పాటుగా, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, వైద్య విద్యా సంచాలకులు డా రమేష్ రెడ్డి, ప్రజావైద్య సంచాలకులు డా.శ్రీనివాస్ రావు, కరోనా నిపుణుల కమిటీ సభ్యులు డా కరుణాకర్ రెడ్డి, డా గంగాధర్ పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ