రేపు బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం, పలు అంశాలపై పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం?

CM KCR to Chair Joint Meeting of BRS State Executive Committee Parliamentary Party and Legislature Party on March 10,CM KCR to Chair Joint Meeting of BRS,BRS State Executive Committee,Parliamentary Party and Legislature Party,CM KCR Joint Meeting on March 10,Mango News,Mango News Telugu,BRS parliamentary party to Meet,CM KCR Latest News,CM KCR Meeting Updates,Telangana News,Telangana Political News And Updates,BRS State Executive Committee News,CM KCR Joint Meeting Live News

బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రేపు (మార్చి 10, శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు), పార్లమెంటరీ పార్టీ (ఎంపీలు), బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో కూడిన సంయుక్త సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఈ సంయుక్త సమావేశానికి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్స్, కార్పోరేషన్‌ చైర్మన్స్, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్స్ సహా పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి పార్టీ నేతలు హాజరుకానున్నారు.

ఈ సమావేశం సందర్భంగా పార్టీకి సంబంధించిన కొత్త నిర్ణయాలు, ఎన్నికలకు సిద్ధం కావడం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలుపై ప్రజల్లో ప్రచారం, బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ, బీజేపీపై పోరాటం, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు సహా పలు అంశాలపై కీలకంగా చర్చించి, పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది. కాగా ఈ సమావేశానికి ఆహ్వానితులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + five =