దేశంలో త‌ల‌సేమియా కేసులు లేని తొలి రాష్ట్రంగా తెలంగాణ‌ను నిలిపేందుకు కృషి చేస్తాం – మంత్రి హరీష్ రావు

Minister Harish Rao Announces We will Work To Keep Telangana as a Thalassemia Free State, Harish Rao Announces We will Work To Keep Telangana as a Thalassemia Free State, Telangana as a Thalassemia Free State, Thalassemia Free State, Minister of Finance of Telangana, T Harish Rao Finance Minister of Telangana, T Harish Rao, Telangana Finance Minister, T Harish Rao Telangana Finance Minister, Telangana Thalassemia, Telangana Thalassemia News, Telangana Thalassemia Latest News, Telangana Thalassemia Latest Updates, Thalassemia, Mango News, Mango News Telugu,

దేశంలో త‌ల‌సేమియా కేసులు లేని తొలి రాష్ట్రంగా తెలంగాణ‌ను నిలిపేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ ‌రావు ప్రకటించారు. తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ (TSCS) “తలసేమియా ఫ్రీ ఇండియా” లక్ష్యంతో ఈ వ్యాధుల నివారణపై అవగాహనకు మొట్టమొదటి జాతీయ స్థాయి సదస్సును ఏప్రిల్ 30 నుంచి మే 1 వరకు రెండు రోజుల పాటు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాం పల్లి రాఘవేంద్ర కాలనీలోని తలసేమియా సికిల్ సొసైటీలో నిర్వహిస్తున్న ఈ జాతీయ సదస్సుకు దేశం నలుమూలల నుంచి 200 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి హరీష్ రావు హాజరయ్యారు.

ఈ సదస్సులో హరీష్ ‌రావు మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలోని 33 రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో మల్టీ స్పెషలిస్ట్‌ ఆస్పత్రిని నిర్మించే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. తలసేమియా వ్యాధిని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చడం ద్వారా పేదలకు ఎంతో మేలు కలుగనుందని వెల్లడించారు. గర్భం దాల్చిన మొదటి త్రైమాసికంలో ప్రతి గర్భిణీ స్త్రీకి తప్పనిసరిగా ప్రసవానంతర పరీక్ష – హెచ్‌బీఏ2 కోసం G.O విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి TSCS విజ్ఞప్తి చేసిందని, వారి విజ్ఞప్తిని పరిశీలించి రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ వ్యాధి నివారణకు మా వంతు కృషి చేస్తామ‌ని, నగరంలోని ఉస్మానియా, నీలోఫర్, గాంధీ ఆసుపత్రుల్లో తలసేమియా రోగులకు చికిత్స అందిస్తోంద‌న్నామని హ‌రీష్ ‌రావు తెలిపారు.

ఈ సందర్భంగా తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ (TSCS) అధ్యక్షుడు శ్రీ చంద్రకాంత్ అగర్వాల్ మాట్లాడుతూ.. భారతదేశంలో మొదటిసారిగా తలసేమియా మరియు సికిల్ సెల్ అనీమియా నివారణపై జాతీయ స్థాయి సదస్సును నిర్వహించడం మాకు నిజంగా ప్రోత్సాహకరమైన సందర్భమని పేర్కొన్నారు. TSCS హైదరాబాద్‌లో ఉచితంగా ఆధునిక పరికరాలు & స్పెషలిస్ట్ వైద్యులతో 3000 మందికి పైగా తలసేమియా పిల్లలకు సేవలందిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద సొసైటీ అని తెలిపారు. సంస్థ అందిస్తోన్న ఉచిత సేవల్లో డాక్టర్ కన్సల్టేషన్, ఉచిత లేబొరేటరీ పరిశోధనలు (CBP), మందులు, HLA పరీక్ష, రక్త మార్పిడి మరియు ఉచిత బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఉన్నాయని వెల్లడించారు. “తలసేమియా రహిత తెలంగాణ” చేయాలనే లక్ష్యంలో భాగంగా ఇటీవలే ఖమ్మంలో ఈ సంస్థ తన మొదటి శాఖను ప్రారంభించిందని తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + twenty =