హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో గురువారం 12వ గ్రాండ్ నర్సరీ మేళాను రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. నేటి నుంచి ఐదు రోజుల పాటు, ఈనెల 22 వరకు ఈ గ్రాండ్ నర్సరీ మేళా జరగనుంది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. స్టాళ్లలో ఉన్న పలు రకాల మొక్కలు గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నర్సరీ మేళా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం కూడా చెట్ల పెంపకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి కృషి చేస్తోందని తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో హరితహారంతో మొక్కలు పెంచడం, పల్లె ప్రకృతి వనాలు వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు.
హైదరాబాద్ నగర వాసులకు ఇది మంచి అవకాశమని, ఇళ్ళల్లో మొక్కలు పెంచడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, మానసిక ఒత్తిడి కూడా తగ్గించుకోవచ్చని హరీష్ రావు సలహా ఇచ్చారు. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి 120కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, స్టాల్స్‌లో 100కుపైగా అరుదైన మొక్కలు, విత్తనాలు, ఎరువులు, పరికరాలు ప్రదర్శనతో పాటు విక్రయాలు కూడా జరుగుతాయని తెలిపారు. పూలు, పండ్లు, గార్డెనింగ్ లాంటి మొక్కలు అందుబాటులో ఉన్నాయని, ఇంటి వద్ద పెంచుకోవడానికి అన్ని రకాల మొక్కలు ఒకే చోట దొరుకుతాయని చెప్పారు. ఇక ప్రతి తల్లి-దండ్రులు తమ పిల్లల జన్మదినం రోజున మొక్కలు నాటాలని, అలాగే నాటిన మొక్కలను పిల్లలతో కలిసి పెంచాలని సూచించారు. దీనివలన వారికి మొక్కల పెంపకం, పచ్చదనం పట్ల ఆసక్తి కలిగి భవిష్యత్తులో కూడా దీనిని కొనసాగిస్తారని తెలియజేశారు. ఇంకా ఆత్మీయులు ఎవరైనా మరణిస్తే, వారికి గుర్తుగా ఒక మొక్కను నాటే అలవాటును చేసుకోవాలని కూడా మంత్రి హరీష్ రావు కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY