ట్రాఫిక్‌ కానిస్టేబుల్ బాబ్జీని అభినందించిన మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao Praises Traffic Constable Babji over Abids Ambulance Incident

హైదరాబాద్ నగరంలోని అబిడ్స్ ప్రాంతంలో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన ఓ అంబులెన్స్‌ కు పరిగెడుతూ దారి చూపించిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్ బాబ్జీకి ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. బాబ్జీ అంబులెన్స్ ముందు పరిగెత్తి ట్రాఫిక్ క్లియర్ చేస్తూ సరైన సమయంలో ఆసుపత్రికి వెళ్లేలా చేయడంతో అందులోని వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్ర మంత్రులు, నెటిజెన్స్ బాబ్జీని అభినందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు కూడా బాబ్జీని అభినందిస్తూ ట్వీట్ చేశారు. “మానవత్వం పరిమళించే మంచి మనుషుల్ని చూసినప్పుడు గొప్ప సంతోషం కలుగుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిన కాపాడటం కోసం హైదరాబాద్ అబిడ్స్ లో కానిస్టేబుల్ బాబ్జీ పడిన తపన చూసినప్పుడు అంతే సంతోషం వేసింది. ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన అంబులెన్స్ ను ఆస్పత్రికి చేర్చిన తీరు అందరికీ ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది. పోలీసు డిపార్టమెంట్ గర్వంగా ఫీలయ్యే గొప్ప పనిచేశావు. హేట్సాఫ్ బాబ్జీ!” అని మంత్రి హరీశ్ రావు ప్రశంసలు కురిపించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ