రాబోయే సంవత్సరాల్లో తెలంగాణలో పెద్దఎత్తున ఆయిల్ పామ్ సాగు : మంత్రి హరీశ్ రావు

Cultivation of Oil Palm, Cultivation of Oil Palm In Telugu, Focus on oil palm cultivation, Mango News, Meeting on Cultivation of Oil Palm, Minister Harish Rao, Minister Harish Rao held Meeting on Cultivation of Oil Palm, Minister Harish Rao held Meeting on Cultivation of Oil Palm in the State, Minister Harish Rao holds a meeting on cultivation, Minister Harish Rao holds a meeting on cultivation of Oil Palm, Oil Palm, Telangana govt to take up Oil palm cultivation, Telangana govt to take up Oil palm cultivation in big way, Telangana Oil palm cultivation

రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లతో కలసి సోమవారం నాడు రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు పెంపుపై సమావేశం చర్చించారు.

రాబోయే సంవత్సరాల్లో ఆయిల్ పామ్ సాగును రాష్ట్రంలో పెద్దఎత్తున చేపట్టనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. 2022వ సంవత్సరంలో ఆయిల్ పామ్ సాగును భారీ స్థాయిలో చేపట్టుటకు ఇప్పటి నుండే ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పర్యావరణ అనుకూలమైన ఆయిల్ పామ్ సాగుతో రైతులకు ఎక్కువగా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఆయిల్ పామ్ నర్సరీలను పెంచడానికి చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను కోరారు, ఆయిల్ పామ్ విస్తీర్ణాన్ని పెంచడంలో మొక్కల లభ్యతే ప్రధాన అంశమని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటుగా పలువురు అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 7 =