కన్నుల పండుగగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం

Ganesh Immersion, Ganesh Immersion 2019, Ganesh Immersion In Hyderabad, Ganesh Immersion In telangana, Ganesh Immersion Live Updates, Khairatabad Ganesh 2019, Khairatabad Ganesh Immersion, Khairatabad Maha Ganapathi Immersion, Khairatabad Maha Ganapathi Immersion Completed, Mango News Telugu

హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనాల శోభాయాత్ర కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం మొదలయిన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర భక్తుల కోలాహలం మధ్య కొనసాగింది. ఎన్టీఆర్ మార్గ్ కు చేరుకున్న మహాగణపతికి అశేష భక్తజనం కోలాహలం మధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో క్రేన్ నెంబర్ 6 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. ఈసారి గణేశుడు పూర్తిగా మునగడం విశేషం. 10 రోజుల పాటు పూజలందుకున్న మహాగణపతికి ప్రభుత్వం ఘనంగా చేసిన ఏర్పాట్లతో ఉత్సవ సమితి సభ్యులు నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా పూర్తి చేసారు.

సుమారు ఏడూ గంటలపాటు సాగిన ఈ శోభాయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. మహాగణపతిని సాగనంపడానికి వచ్చిన భక్తజనంతో హుస్సేన్ సాగర్ పరిసరప్రాంతాలు జనసంద్రంగా మారాయి. భక్తులు గణేశుడిని కీర్తించే నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా మహాగణపతి నిమజ్జనం పూర్తవడంతో ఉత్సవ సమితి సభ్యులు, అధికారులు, పోలీసులు, భక్తజనం ఆనందం వ్యక్తం చేసారు.

 

[subscribe]
[youtube_video videoid=3DgKEK-TvmU]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 2 =