ఏపీలో పదోతరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, పరీక్షల తేదిలివే…

Andhra Pradesh, Andhra Pradesh Intermediate Exams Schedule, Andhra Pradesh Intermediate Exams Schedule 2022, Andhra Pradesh SSC and Intermediate 2022 Exams Schedule Released, Andhra Pradesh SSC Exams, Andhra Pradesh SSC Exams Schedule, Andhra Pradesh SSC Exams Schedule 2022, Mango News, SSC and Intermediate 2022, SSC and Intermediate 2022 Exams, SSC and Intermediate 2022 Exams Schedule, SSC and Intermediate 2022 Exams Schedule Released

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదోతరగతి, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్స్ ను రాష్ట్రమంత్రులు ఆదిమూలపు సురేష్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గురువారం విడుదల చేశారు. పదో తరగతి-2022 పరీక్షలు మే 2 నుంచి మే13 వరకు జరగనున్నాయి. ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 27 వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 28 వరకు ఇంటర్‌ రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య నిర్వహించనున్నారు. అలాగే జనరల్, ఒకేషనల్ కోర్సులకు మార్చి 11 నుంచి మార్చి 31 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనున్నాయి. ఇక మార్చి 7 వ తేదీన నైతిక, మానవ విలువల పరీక్ష మరియు మార్చి 9న పర్యావరణ విద్య పరీక్ష నిర్వహిస్తామని షెడ్యూల్లో పేర్కొన్నారు.

ఏపీలో పదో తరగతి-2022 పరీక్షల షెడ్యూల్:

 • మే 2: ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్-1, ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్-1 (కంపోజిట్ కోర్స్)
 • మే 4: సెకండ్ లాంగ్వేజ్‌ పేపర్
 • మే 5: ఇంగ్లీష్ పేపర్
 • మే 7: మ్యాథమేటిక్స్ పేపర్
 • మే 9: ఫిజికల్ సైన్స్ పేపర్
 • మే 10: బయోలాజికల్ సైన్స్‌ పేపర్
 • మే 11: సోషల్ స్టడీస్ పేపర్
 • మే 12: ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్-2, ఓఎస్‌ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్‌ పేపర్-1
 • మే 13: ఓఎస్‌ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్‌ పేపర్-2, ఎస్‌ఎస్సీ ఒకేషనల్ కోర్స్‌ థియరీ.

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్:

 • ఏప్రిల్ 8: సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 1
 • ఏప్రిల్ 11: ఇంగ్లీష్ పేపర్-1
 • ఏప్రిల్ 13: మ్యాథమేటిక్స్ పేపర్- 1A, బోటనీ పేపర్- 1, సివిక్స్ పేపర్- 1,
 • ఏప్రిల్ 18: మ్యాథమేటిక్స్ పేపర్-1B, జువాలజీ పేపర్ -1, హిస్టరీ పేపర్ -1
 • ఏప్రిల్ 20: ఫిజిక్స్ పేపర్ -1, ఎకనామిక్స్ పేపర్ -1
 • ఏప్రిల్ 22: కెమిస్ట్రీ పేపర్ -1, కామర్స్ పేపర్ -1, సోషియాలజీ పేపర్ -1, ఫైనర్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ -1
 • ఏప్రిల్ 25: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, లాజిక్ పేపర్ -1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ -1 (బైపిసి విద్యార్థులకు)
 • ఏప్రిల్ 27: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -1 మరియు జాగ్రఫీ పేపర్ -1.

ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షల షెడ్యూల్:

 • ఏప్రిల్ 9: సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 2
 • ఏప్రిల్ 12: ఇంగ్లీష్ పేపర్ -2
 • ఏప్రిల్ 16: మ్యాథమేటిక్స్ పేపర్- 2A, బోటనీ పేపర్- 2, సివిక్స్ పేపర్- 2
 • ఏప్రిల్ 19: మ్యాథమెటిక్స్ పేపర్- 2B, జువాలజీ పేపర్- 2, హిస్టరీ పేపర్- 2
 • ఏప్రిల్ 21: ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
 • ఏప్రిల్ 23: కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్ -2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ -2
 • ఏప్రిల్ 26: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, లాజిక్ పేపర్ -2, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ -2
 • ఏప్రిల్ 28: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -2, జాగ్రఫీ పేపర్ -2.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + four =