రూ.26.45 కోట్లతో నిర్మించిన బైరామ‌ల్‌గూడ ఫ్లైఓవ‌ర్‌ను ప్రారంభించిన మంత్రి కేటిఆర్

Bairamalguda, Bairamalguda flyover, Bairamalguda Right Side Flyover, Hyderabad, KT Rama Rao to inaugurate Bairamalguda flyover, KTR, KTR Inaugurated Bairamalguda Right Side Flyover, Minister KTR, Telangana Minister inaugurates Bairamalguda flyover

హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఎస్‌.ఆర్‌.డి.పి ప్యాకేజి-2 లో భాగంగా రూ.26.45 కోట్ల వ్య‌యంతో నిర్మించిన బైరామ‌ల్‌గూడ కుడివైపు ఫ్లైఓవ‌ర్‌ను రాష్ట్ర పుర‌పాల‌క, ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు ఆగస్టు 10, సోమ‌వారం నాడు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్ర‌ద‌ర్శ‌న‌ను తిల‌కించారు. ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభంతో బైరామల్‌గూడ జంక్షన్‌, సాగర్ ‌రింగ్ రోడ్‌ జంక్షన్‌ల పరిధిలో ట్రాఫిక్‌ సమస్యలు తీరనున్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర విద్య శాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, జిహెచ్‌ఎంసి మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, ఎమ్మెల్సీ ఎగ్గె మ‌ల్లేశం, ఎల్బీన‌గ‌ర్ జోన‌ల్ క‌మిష‌న‌ర్ ఉపేంద‌ర్‌రెడ్డి, డిప్యూటి క‌మిష‌న‌ర్ విజ‌య్‌కృష్ణ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu